రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపిన విధానంపై క్రికట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రశంసలు కురిపించాడు. తన జీవితంలో తాను చూసిన అత్యుత్తమ ఫీల్డింగ్ అంటూ కితాబిచ్చాడు. అయితే దీనిపై పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు.
"క్రికెట్ దేవుడు సచిన్ మెచ్చుకున్నాక ఇందులో సందేహ పడాల్సిందేమీ లేదు. ఇదే అత్యుత్తమ ఫీల్డింగ్. అద్భుతంగా బంతి కోసం డైవ్ చేశావు నికోలస్ పూరన్. దీంతో పంజాబ్ ఫీల్డర్లలో స్పూర్తిని కలిగించావు. నేను చూసిన ఫీల్డింగ్‌లో ఇదే అత్యుత్తమం" అంటూ సచిన్ ట్వీట్‌కు బదులిచ్చాడు.
ఈ క్రమంలోనే పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ట్వీట్‌కు స్పందించిన సచిన్.. మైదానంలో 30 యార్డ్ సర్కిల్లో అత్యుత్తమ ఫీల్డర్‌గా రోడ్స్‌ను పేర్కొన్నాడు.
"జాంటీ.. నేను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ గురించి చెబుతున్నా. 30 యార్డ్ సర్కిల్లో నువ్వే అత్యుత్తమ ఫీల్డర్‌వి" అంటూ సచిన్ రిప్లై ఇచ్చాడు.
-
Jonty, I was talking about saves on the boundary line.
— Sachin Tendulkar (@sachin_rt) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
In your territory (30 yard circle), you were undoubtedly the best! 🙌🏻 https://t.co/tZSq3VL1Y5
">Jonty, I was talking about saves on the boundary line.
— Sachin Tendulkar (@sachin_rt) September 28, 2020
In your territory (30 yard circle), you were undoubtedly the best! 🙌🏻 https://t.co/tZSq3VL1Y5Jonty, I was talking about saves on the boundary line.
— Sachin Tendulkar (@sachin_rt) September 28, 2020
In your territory (30 yard circle), you were undoubtedly the best! 🙌🏻 https://t.co/tZSq3VL1Y5
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సంజూ శాంసన్ బంతిని గాల్లోకి లేపాడు. బంతి బౌండరీ లైన్‌పై పడే ముందు.. గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టాడు పూరన్. నేలకు తాకకముందే బంతిని తిరిగి మైదానంలోకి విసిరాడు. ఫలితంగా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు, అభిమానుల ప్రశంసలు పొందాడీ ఆటగాడు.
ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 223 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ బ్యాటింగ్ దూకుడుతో మ్యాచ్‌ను మలుపుతిప్పింది. మూడు బంతులు మిగిలుండగానే 226 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించింది.