ETV Bharat / sports

టీ20ల్లో అందుకే రషీద్​ ఖాన్ గొప్ప బౌలర్! - సన్​రైజర్స్ X దిల్లీ కాపిటల్స్

దిల్లీతో మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసిన స్పిన్నర్ రషీద్ ఖాన్.. తాను ఉత్తమ బౌలర్​ అని మరోసారి నిరూపించుకున్నాడు. 1.80 ఎకానమీతో ఏడే పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Rashid Khan_SRH
'అందుకే రషీద్ టీ20ల్లో​ గొప్ప బౌలర్'
author img

By

Published : Oct 28, 2020, 11:40 AM IST

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ కాపిటల్స్​ను తక్కువ పరుగులకే కట్టడి చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది సన్​ రైజర్స్ హైదరాబాద్. అయితే, ఈ మ్యాచ్​లో నాలుగు ఓవర్లలో 17 డాట్​ బాల్స్ వేసిన రషీద్​ ఖాన్​... టీ20ల్లో తాను ఉత్తమ బౌలర్లలో ఒకడని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్​లో 1.80 ఎకానమీ నమోదు చేసి వాహ్ అనిపించాడు.

4 ఓవర్లలో పరుగులు ఇలా..

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ బ్యాట్స్​మెన్​కు రషీద్ ఖాన్ చెమటలు పట్టించాడు. నాలుగు ఓవర్లలో ఏడే పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. దీంతో 19 ఓవర్లలో 131 పరుగులే చేయగలిగింది దిల్లీ.

ఈ సీజన్​లో ఇప్పటివరకు 12 మ్యాచ్​లాడిన రషీద్.. 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన వారిలో రబాడ(23), మహమ్మద్ షమి(20) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

rashid
దిల్లీతో జరిగిన మ్యాచ్​లో రషీద్​

పరుగులు ఇవ్వకపోవడమే లక్ష్యంగా

ప్రత్యర్థికి పరుగులివ్వకుండా డాట్​ బాల్స్ వేయడమే తన లక్ష్యమని దిల్లీతో మ్యాచ్​ అనంతరం రషీద్​ఖాన్ చెప్పాడు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్​ చేయనని అన్నాడు. ఎంతటి బ్యాట్స్​మెన్​నైనా పరుగులు చేయకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.

2017లో ఐపీఎల్​లో అడుగుపెట్టిన రషీద్.. డాట్​ బాల్స్ ఎక్కువగా వేసిన తొలి ఐదుగురు బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.

ఇదీ చదవండి:పంజాబ్ వరుస విజయాలకు కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.