టీ20 క్రికెట్‌ను ఇష్టపడే సినిమా తారలు ఎందరో ఉన్నారు. హైదరాబాద్‌లో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరిగినా ఎవరో ఒకరు మైదానానికి వస్తూనే ఉంటారు. అందులో 'విక్టరీ' వెంకటేశ్ అందరికన్నా ముందుంటారు. వీలుకుదిరితే ప్రతి మ్యాచ్‌కు వచ్చి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆయన ప్రోత్సహించేవారు. బాగా ఆడిన ఆటగాళ్లను అభినందించేవారు. ఎందుకంటే క్రికెట్ అంటే ఆయనకు పిచ్చి!
హైదరాబాద్‌ను క్రికెట్ ఫీవర్లో ముంచేసే లీగ్ ఈ సారి యూఏఈలో జరుగుతోంది. కరోనా వైరస్ విజృంభించడమే అందుకు కారణం. దాంతో నగరవాసులు ఆరెంజ్ ఆర్మీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు నోచుకోలేకపోయారు. క్రికెట్ మజాను ఆస్వాదించలేకపోతున్నారు.
హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనున్న సందర్భంగా వార్నర్ సేనకు వెంకీ మామ శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా ఆడాలని ట్వీట్ చేశారు. 'కుర్రాళ్లూ.. మిమ్మల్నెప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాను' అని పేర్కొన్నారు.
-
All the best to the @SunRisers team 🙌🏼
— Venkatesh Daggubati (@VenkyMama) September 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I’m rooting and cheering for you guys! 🥳 pic.twitter.com/aw15mS68HF
">All the best to the @SunRisers team 🙌🏼
— Venkatesh Daggubati (@VenkyMama) September 21, 2020
I’m rooting and cheering for you guys! 🥳 pic.twitter.com/aw15mS68HFAll the best to the @SunRisers team 🙌🏼
— Venkatesh Daggubati (@VenkyMama) September 21, 2020
I’m rooting and cheering for you guys! 🥳 pic.twitter.com/aw15mS68HF
వెంకటేశ్ ట్వీట్‌కు ఆరెంజ్ ఆర్మీ బదులిచ్చింది. 'స్టాండ్స్‌లో ఉండి ప్రోత్సహించే మిమ్మల్ని మేం మిస్సవుతాం వెంకీమామా' అని రీట్వీట్ చేసింది. ఏటా నాని, సుశాంత్, ఛార్మి, రకుల్‌ప్రీత్ లాంటి ఎందరో తారలు ఉప్పల్ మైదానానికి వచ్చి హైదరాబాద్‌ను ప్రోత్సహించేవారు.
తొలి మ్యాచ్‌లో కోహ్లీసేనను ఓడించి టోర్నీలో శుభారంభం చేయాలని హైదరాబాద్ ఆశిస్తోంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.