పాయింట్స్ టేబుల్ అట్టడుగున సీఎస్కే
చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో వార్నర్‌సేన గెలుపొందింది. సన్‌రైజర్స్ బౌలర్లు.. మొదటి నుంచి సీఎస్కే బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడంలో విజయం సాధించారు. సన్‌రైజర్స్ డెత్ ఓవర్ స్పెషలిస్టు నటరాజన్ రెండు ప్రధాన వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది.
టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకున్న సన్‌రైజర్స్ పాయింట్స్ టేబుల్లో నాలుగోస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన నాలుుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవడం వల్ల రెండు పాయింట్లతో టేబుల్ చివరిస్థానానికి చెన్నై సూపర్‌కింగ్స్ పరిమితమైంది.