ETV Bharat / sports

'పొలార్డ్​.. ఐపీఎల్​లో 200 మ్యాచులు పక్కా' - ఐపీఎల్​ 2020

భవిష్యత్తులో ముంబయి​ తరఫున 200 మ్యాచులు ఆడగలిగే ఏకైక క్రికెటర్​ పొలార్డ్​ అని ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య చెప్పాడు. పొలార్డ్​ జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడని పొగడ్తలు కురిపించాడు.

Pollard
పోలార్డ్
author img

By

Published : Sep 24, 2020, 9:34 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ముంబయి ఇండియన్స్ తరఫున పొలార్డ్, 200 మ్యాచ్​లు కచ్చితంగా ఆడుతాడని హార్దిక్ పాండ్య అభిప్రాయపడ్డాడు. ఆ సత్తా ఉన్న ఒకే ఒక్క క్రికెటర్ ఇతడని, భవిష్యత్తులో ఆ సంఖ్యను అందుకుంటాడని చెప్పాడు. బుధవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో ఆడి, ఐపీఎల్​లో 150 మ్యాచ్​లాడిన మార్క్​ అందుకున్నాడు.

ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచులు ఆడగలిగే ఏకైక క్రికెటర్​ కీరన్​ పొలార్డ్​. మరో 4-5 ఏళ్ల పాటు ముంబయి ఇండియన్స్​లోనే ఉంటాడు. మా జట్టులోని ఆటగాళ్లకు అతడు మార్గదర్శకుడు. గెలుపు ఓటముల్లో అన్నదమ్ములలాగా ఒకరికి ఒకరు తోడు ఉంటాం.

-హార్దిక పాండ్య, ముంబయి ఆల్​రౌండర్

జట్టు క్లిష్ట పరిస్థితులో ఉన్నప్పుడు పొలార్డ్​ చాలాసార్లు అండగా నిలిచాడని సారథి రోహిత్​ శర్మ ప్రశంసించాడు. ముంబయి ఇండియన్స్​ ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిగా నిలిచాడని జస్ప్రీత్​ బుమ్రా అన్నాడు.

ఇదీ చూడండి ఒకే జట్టుపై గెలిచి ముంబయి సరికొత్త రికార్డు

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.