ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు ముంబయి పేసర్ బౌల్ట్. భారీ ఛేదనలో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లలో అతను దిల్లీ తరఫున ఆడడం విశేషం. గత సీజన్లో అంతగా రాణించకపోయినందున అతణ్ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం ముంబయికి అప్పగించింది. కానీ, ఇప్పుడేమో ఆ జట్టు వదులుకున్న ఆటగాడే దాన్ని దెబ్బ తీశాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న మలింగ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్‌కు దూరం కావడం వల్ల.. ముంబయి బౌలింగ్ బలహీనంగా మారుతుందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, జట్టులోకి వచ్చిన బౌల్ట్.. బుమ్రాతో కలిసి ఆ లోటు కనిపించకుండా చేశాడు. ప్రస్తుతం లీగ్‌లో అత్యంత ప్రమాదకర పేస్ జోడీ వీరిదే కావడం విశేషం.అత్యధిక వికెట్ల వీరుల్లో బుమ్రా 27 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. బౌల్ట్ 22 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఇవీ చూడండి:తడబడిన దిల్లీ.. ఫైనల్‌కు చేరిన ముంబయి