ETV Bharat / sports

గిల్ అదరగొట్టాడు.. కోల్​కతా గెలిచింది - ipl 13 season

సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్​ రైడర్స్​ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని కోల్​కతా 18 ఓవర్లలోనే ఛేదించింది. శుభమన్​ గిల్​(70 ) మెరవగా.. మోర్గాన్​(42), నితిశ్​ రానా(26) రాణించారు. హైదరాబాద్​ బౌలర్లు తేలిపోయారు. ఈ విజయంతో కోల్​క​తా పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది.

kolkatha knight riders beat sun risers hyderbad
కోల్​కతా ఘన విజయం..
author img

By

Published : Sep 26, 2020, 11:39 PM IST

Updated : Sep 27, 2020, 11:02 AM IST

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓడిపోయింది. 143 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది కోల్​కతా. శుభమన్​ గిల్​(70 ) అర్థశతకంతో అదరగొట్టి కోల్​కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

కోల్​కతా బ్యాటింగ్​లో ఇయాన్​ మోర్గాన్​(42) నితిశ్​ రానా(26) మెరిశారు. సన్​రైజర్స్​ బౌలర్లలో నటరాజన్​, రషీద్​ ఖాన్,​ ఖలీల్ అహ్మద్​ తలో వికెట్​ తీశారు. మిగిలిన వారు తేలిపోయారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది కోల్​కతా. కాగా.. సన్​రైజర్స్​కు ఇది వరుసగా రెండో ఓటమి.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్​రైజర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు‌ చేసింది. 24 పరుగుల వద్దే జానీ బెయిర్‌స్టో (5) కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డవ్వగా, తర్వాత డేవిడ్‌ వార్నర్‌ ‌(36; 30 బంతుల్లో 2x4, 1x6) జట్టు స్కోరు 59 వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ధాటిగా ఆడే క్రమంలో 10వ ఓవర్‌ తొలి బంతికే బౌలర్‌ వరున్‌ చక్రవర్తికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం మనీష్‌ పాండే (51; 38 బంతుల్లో 3x4, 2x6), వృద్ధిమాన్‌ సాహా (30; 31 బంతుల్లో 1x4, 1x6) వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో స్కోరు బోర్డు నెమ్మదిగా ముందుకుసాగింది. చివర్లో మనీష్‌ అర్ధశతకం సాధించాక రసెల్‌ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో ఔటయ్యాడు. అతడు వేసిన ఫుల్‌టాస్‌ను ఆడే క్రమంలో బంతి బ్యాట్‌కు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. చివర్లో మహ్మద్‌ నబి (11; 8 బంతుల్లో 2x4) రెండు బౌండరీలు బాదడం వల్ల స్కోర్‌ 142 పరుగులకు చేరింది. కోల్​కతా బౌలర్లలో కమిన్స్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్​ తీశారు.

Last Updated : Sep 27, 2020, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.