ETV Bharat / sports

ఐపీఎల్: రస్సెల్ షాట్​కు పగిలిపోయిన కెమెరా - kkr

కోల్​కతా నైట్​రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ నెట్​ ప్రాక్టీస్​కు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఇందులో బ్యాటింగ్​తో విరుచుకుపడ్డాడు రస్సెల్​. సెప్టెంబరు 23న ముంబయి ఇండియన్స్​తో తలపడేందుకు సిద్ధమవుతోంది కేకేఆర్​.

Kolkata Knight Riders
కోల్​కతా నైట్​రైడర్స్
author img

By

Published : Sep 22, 2020, 5:37 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్​ ప్రారంభంతో క్రికెట్​ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. తమ ఫ్రాంచైజీలకు మద్దతు తెలుపుతూ సోషల్​ మీడియా వేదికగా పోస్టులతో దూసుకెళ్తున్నారు. ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన ఐపీఎల్​ జట్లలో కోల్​కతా నైట్​రైడర్స్​ ఒకటి. సెప్టెంబరు 23న ముంబయి ఇండియన్స్​తో తొలి మ్యాచ్​ ఆడనుంది​. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లంతా ట్రైనింగ్​ సెషన్​లో తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే కోల్​కతా నైట్​ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్​ నెట్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఇందులో రస్సెల్​ వచ్చిన బంతిని వచ్చినట్లే బాదుతూ కనిపించాడు. చివర్లో స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. బంతి కెమెరా గ్లాస్​కు​ తాకి పగిలిపోయింది.

గత సీజన్లలో కేకేఆర్​ తరఫున ఆడిన రస్సెల్​.. అనేక మ్యాచ్​ల్లో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతను మైదానంలో అడుగుపెడుతన్నాడంటే చాలు మ్యాచ్​పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి.

గతేడాది ఐపీఎల్​లో రస్సెల్​ 56.66 సగటుతో 504 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో ఐదో స్థానం దక్కించుకున్నాడు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.