ETV Bharat / sports

దిల్లీపై కోల్​కతా అదిరిపోయే విజయం - ఐపీఎల్ వార్తలు

తమ ఆటగాళ్ల సమష్టి కృషితో దిల్లీపై కోల్​కతా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో నితీశ్ రానా(81 పరుగులు), బౌలింగ్​లో వరుణ్ చక్రవర్తి(5-20) అదరగొట్టారు.

kolkata knight riders beat Delhi capitals by 59 runs
కోల్​కతా నైట్​రైడర్స్ ఐపీఎల్
author img

By

Published : Oct 24, 2020, 7:25 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్ ఊపిరి పీల్చుకుంది. దిల్లీ క్యాపిటల్స్​పై 59 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​లో లక్ష్యాన్ని ఛేదించడంలో దిల్లీ విఫలమైంది. దీంతో ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేయగలిగింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా.. ప్రారంభంలో 42 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. శుభ్​మన్ గిల్(9), రాహుల్ త్రిపాఠి(13), దినేశ్ కార్తిక్(3) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం వచ్చిన నరైన్.. ఓపెనర్ నితీశ్ రానాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

narine nitish rana
నరైన్-నితీశ్ రానా

క్రీజులో కుదురుకున్న తర్వాత వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్​కు 115 పరుగులు జోడించి, నరైన్(32 బంతుల్లో 64) ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ మోర్గాన్​(17)తో కలిసిన నితీశ్ రానా.. కాసేపు ధనాధన్ బ్యాటింగ్ చేసి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.​ దీంతో నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది కోల్​కతా. దిల్లీ బౌలర్లలో అన్రిచ్, స్టోయినిస్, రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ అది నుంచే తడబడింది. మూడు ఓవర్లలోపే ఓపెనర్లు రహానె(0), ధావన్(6)ల వికెట్లు పోగొట్టుకుంది. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(47), పంత్(27).. కాసేపు నిలబడినా సరిపోలేదు. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికిలోనై వెంట వెంటనే ఔటయ్యారు.

varun chakravarthy
కోల్​కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి

అనంతరం వచ్చిన బ్యాట్స్​మెన్​లో హెట్మయిర్(10), స్టోయినిస్(6), అక్షర్ పటేల్(9), రబాడ(9), అశ్విన్(14 నాటౌట్), తుషార్(1), అన్రిచ్(0).. అంతంతమాత్రంగానే ఆడారు. కోల్​కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టగా, కమిన్స్ 3, ఫెర్గూసన్ 1 వికెట్ తీశారు.

ఇది చదవండి: చనిపోయిన మామయ్యకు రానా అర్థశతకం అంకితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.