ETV Bharat / sports

ఐపీఎల్2020: యూఏఈ గడ్డపై ముంబయికి కష్టమేనా! - ముంబయి ఇండియన్స్​ బలాలు

రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ నేడు చెన్నై సూపర్ కింగ్స్​తో ఐపీఎల్ తొలి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే కరోనా కారణంగా ఈసారి లీగ్ యూఏఈ వేదికగా జరగనుంది. అక్కడి పిచ్​లపై ముంబయి ఇండియన్స్​ గణాంకాలు ఏమాత్రం బాగాలేవు.

ఐపీఎల్2020
ఐపీఎల్2020
author img

By

Published : Sep 19, 2020, 10:54 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్​ చరిత్రలో ఘనమైన రికార్డున్న జట్టు. ఏకంగా నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. కానీ యూఏఈలో ఈ జట్టు గణాంకాలు చూస్తే ఏమాత్రం బాగాలేవు. స్వదేశీ పిచ్​లపై పులి అయితే అక్కడ పిల్లి అని చెప్పుకోవచ్చు. అక్కడ ఆడిన ఒక్క మ్యాచ్​లోనూ ముంబయి గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆడిన ఐదు మ్యాచ్​ల్లో కోల్​కతా నైట్​రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. ఇందులో మూడు మ్యాచ్​లు దుబాయ్​లో జరగగా, ఒకటి షార్జా, మరొకటి అబుదాబిలో జరిగాయి. నేడు చెన్నై సూపర్ కింగ్స్​తో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్​లపై ముంబయి గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఐపీఎల్2020
రోహిత్
  • ముంబయి ఆటగాళ్లు అక్కడి పిచ్​లపై రెండు అర్ధ శతకాలు నమోదు చేశారు. ఇందులో రోహిత్​ శర్మ ఒక హాఫ్ సెంచరీ బాదగా, పొలార్డ్ మరో అర్ధశతకం చేశాడు.
  • యూఏఈ గడ్డపై ముంబయి ఆటగాళ్లు కోరె అండర్సన్, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ, వికెట్ కీపర్ సీఎం గౌతమ్ చెరో రెండు క్యాచ్​లు పట్టారు. ఈ జట్టు తరఫున ఇవే అత్యధిక క్యాచ్​లు.
  • ఈ జట్టు తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన లసిత్ మలింగ పేరు మీద ఉంది. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఇతడు 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే ఈ జట్టు తరఫున యూఏఈలో ఇతడివే అత్యధిక వికెట్లు. మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు.
  • పొలార్డ్​ ఇక్కడ ఎనిమిది సిక్సులు బాదాడు. ముంబయి జట్టు తరఫున ఓ ఆటగాడి అత్యధిక సిక్సులు ఇవే.
  • యూఏఈలో మొత్తం ముంబయి జట్టు 15 సిక్సులు బాదింది.
  • అక్కడ ముంబయి తరఫున అత్యధిక స్కోరు పొలార్డ్ పేరిట ఉంది. సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో 78 పరుగులు చేశాడు.
    ముంబయి ఇండియన్స్​
    రోహిత్, డికాక్
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అక్కడ ఈ జట్టు అత్యల్పం ఇదే.
  • సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూఏఈలో ఈ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు.
  • యూఏఈలో ముంబయి జట్టు తరఫున రాయుడు 133 పరుగులు చేశాడు. ఇక్కడ ఈ జట్టు తరఫున అత్యధిక పరుగుల వీరుడు ఇతడే.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.