తమ బ్యాట్స్‌మెన్ వైఫల్యమే, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమికి ప్రధాన కారణమని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీ అన్నాడు. బౌలర్లు మాత్రం బాగా ఆడారని ప్రశంసించాడు.
అబుదాబి వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 81) అదరగొట్టాడు. ఛేదనలో చెన్నైకి మంచి ఆరంభమే దక్కింది కానీ.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో 10 పరుగుల తేడాతో ఓడింది.
"మధ్య ఓవర్లలో కోల్‌కతా బౌలర్లకు మా బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకున్నారు. అప్పుడు మేం బాగా ఆడుంటే ఫలితం వేరేలా ఉండేది. మా(చెన్నై) బౌలర్లు ప్రత్యర్థి జట్టును 160 పరుగుల లోపే కట్టడి చేశారు. కానీ మా బ్యాట్స్‌మెన్ సరిగా ఆడలేదు. చివర్లో బౌండరీలు కొట్టలేకపోయారు" -ధోనీ, సీఎస్కే కెప్టెన్
చెన్నై జట్టులో వాట్సన్(50), రాయుడు(30), జడేజా(21) మినహా మిగిలిన వారందరూ త్వరత్వరగా ఔటయ్యారు. బౌలింగ్‌లో బ్రావో 3 వికెట్లు, కర్ణ్ శర్మ్, కరన్, శార్దుల్ ఠాకుర్ తలో రెండు వికెట్లు తీశారు. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు.. అక్టోబరు 10న బెంగళూరుతో తలపడనుంది.