ETV Bharat / sports

మోరిస్​ రాకతో మరింత బలపడ్డాం: కోహ్లీ - kohli praises cris moris

క్రిస్​ మోరిస్​ చేరికతో తమ జట్టు బౌలింగ్​ దళం మరింత బలంగా తయారైందని చెప్పాడు బెంగళూరు జట్టు సారథి కోహ్లీ. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో డివిలియర్స్​ అద్భుత బ్యాటింగ్​ వల్లే భారీ స్కోరు సాధించగలిగామని తెలిపాడు.

Morris
మోరిస్​
author img

By

Published : Oct 13, 2020, 10:44 AM IST

ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ రాకతో తమ జట్టు బౌలింగ్​ దళం మరింత బలపడిందన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్​ కోహ్లీ. బలమైన జట్టుపై అద్భుత విజయం సాధించామని చెప్పాడు. సోమవారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో గెలిచిన ​ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్​లో మోరిస్​ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఏబీ డివిలియర్స్​నూ ప్రశంసించాడు కోహ్లీ. మిగతా బ్యాట్స్​మెన్​ తడబడిన షార్జా పిచ్ పై అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ఏబీ విజృంభించడం వల్లే 20ఓవర్లలో తమ జట్టు 194 పరుగులు చేయగలిగిందని అన్నాడు. తర్వాతి మ్యాచ్​ల్లోనూ మరింత బాగా ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు.

షార్జా వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు జట్టు 82 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు రెండు వికెట్లకు 194 పరుగులు చేసింది. చివర్లో వచ్చిన డివిలియర్స్ (73), కోహ్లీ(33) విధ్వంసం సృష్టించారు. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా తొమ్మిది వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. కోహ్లీసేనకు ఇది ఐదో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. తన తర్వాతి మ్యాచ్​ను అక్టోబర్​ 15న కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో ఆడనుంది.

ఇదీ చూడండి అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ-డివిలియర్స్​ జోడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.