ETV Bharat / sports

ఇది ఐపీఎల్ కాదు.. 'గాయాల ప్రీమియర్​ లీగ్'​​! - hyderabad bhubaneswar kumar news

ఈసారి ఐపీఎల్​కు అడుగడుగునా కష్టాలే! మొదట కరోనా కారణంగా లీగ్​ వాయిదా పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరు నెలల తర్వాత యూఏఈ వేదికగా మొదలుపెడితే.. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాలపాలవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది.

Injured Premier League?
భువనేశ్వర్​
author img

By

Published : Oct 3, 2020, 12:56 PM IST

ఐపీఎల్​ ప్రారంభమై ఇప్పటివరకు 14 మ్యాచ్​లు జరిగాయి. కానీ ఈ ఏడాది లీగ్..​ గాయాల ప్రీమియర్​ లీగ్​గా పేరు తెచ్చుకుంటోంది. టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి చాలామంది ఆటగాళ్లు ఫిట్​నెస్​ లేకపోవడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. మరికొందరు గాయాల కారణంగా కొన్ని మ్యాచ్​లకు దూరమయ్యారు. మిచెల్​ మార్ష్​తో మొదలైన గాయాల పరంపర.. చెన్నై, హైదరాబాద్​ మధ్య జరిగిన మ్యాచ్​ వరకు సాగి క్రమంగా పెరిగిపోతోంది.

19వ ఓవర్​ బౌలింగ్​ చేసిన భువనేశ్వర్​ కుమార్​.. తొడభాగం గాయపడటం వల్ల ఓవర్​ మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. మొదట నొప్పి వచ్చినప్పుడు వైద్యుడి సాయంతో కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. తిరిగి బౌలింగ్​ వేసేందుకు ప్రయత్నించగా మళ్లీ నొప్పి మొదలవ్వడం వల్ల మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్​ మిగిలిన ఓవర్​ను పూర్తిచేశాడు. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన హైదరాబాద్​ కెప్టెన్ వార్నర్.. ఫిజియోతో మాట్లాడితే కానీ, భువీ పరిస్థితి ఏంటో తెలియదని, పూర్తి సమాచారం తెలుసుకున్నాకే సమాధానమిస్తానని పేర్కొన్నాడు.

Injured Premier League
ఫిజియో సాయం తీసుకుంటున్న భువి

గతంలో ఇదే జట్టుకు చెందిన ఆల్​రౌండర్​ మిచెల్​ మార్ష్​, ఇప్పటికే గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు భువనేశ్వర్ కూడా తప్పుకుంటే, సన్​రైజర్స్​ బౌలింగ్ ఆర్డర్​పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Injured Premier League
మిచెల్​ మార్ష్​

అంతకుముందు ముంబయి ఇండియన్స్​ ఆటగాడు ఇషాన్​ కిషన్​ గాయం వల్ల తొలి రెండు మ్యాచ్​లకు దూరమయ్యాడు. ఆ తర్వాత బెంగళూరుతో మ్యాచ్​లో 99 పరుగులు సాధించి.. అద్భుత పురాగమనం చేశాడు. మోకాలి గాయం కారణంగా సీఎస్కే ఆటగాళ్లు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావోలు చెన్నై ఆడిన రెండు మ్యాచ్​లకు దూరమయ్యారు. రవిచంద్రన్​ అశ్విన్​ కూడా భుజం గాయంతో గత రెండు మ్యాచ్​ల్లో ఆడలేకపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.