ETV Bharat / sports

దిల్లీకి మరో విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

రాజస్థాన్ జట్టుపై గెలిచిన దిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. స్మిత్ సేన.. ఫ్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

delhi capitals beat rajasthan royals by 13 runs
దిల్లీకి మరో విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
author img

By

Published : Oct 14, 2020, 11:23 PM IST

రాజస్థాన్ రాయల్స్​పై దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని పూర్తి చేసే క్రమంలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్.

162 పరుగుల ఛేదనలో ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది రాజస్థాన్. ఓపెనర్లు స్టోక్స్-బట్లర్.. మూడు ఓవర్లలో తొలి వికెట్​కు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ మూడో ఓవర్​ చివరి బంతికి బట్లర్(22) ఔటయ్యాడు.

rajasthan royals
రాజస్థాన్ రాయల్స్ జట్టు

అనంతరం క్రీజులోకి వచ్చిన వారిలో స్మిత్(1), సంజూ శాంసన్(25), రాబిన్ ఉతప్ప(32), రియాన్ పరాగ్(1), రాహుల్ తెవాతియా(14), ఆర్చర్ (1), శ్రేయస్ గోపాల్(6) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో అన్రిచ్, తుషార్ దేశ్​పాండే తలో 2 వికెట్లు, అశ్విన్, అక్షర్ పటేల్, రబాడ తలో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దిల్లీ జట్టు. ఓపెనర్ శిఖర్ ధావన్(57) అర్థశతకం చేశాడు. మిగిలిన బ్యాట్స్​మెన్​లో రహానె(2), శ్రేయస్ అయ్యర్(53), స్టాయినిస్(18), అలెక్స్ క్యారీ(14), అక్షర్ పటేల్(7), అశ్విన్(0*) మోస్తరుగా పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, ఉనద్కత్ 2, కార్తిక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.