దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. రుతురాజ్ గైక్వాడ్(65 నాటౌట్) బ్యాటింగ్‌తో మెప్పించాడు.
-
That's that from Match 44.#CSK WIN by 8 wickets with 8 deliveries to spare.#Dream11IPL pic.twitter.com/pwaVHhARS8
— IndianPremierLeague (@IPL) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Match 44.#CSK WIN by 8 wickets with 8 deliveries to spare.#Dream11IPL pic.twitter.com/pwaVHhARS8
— IndianPremierLeague (@IPL) October 25, 2020That's that from Match 44.#CSK WIN by 8 wickets with 8 deliveries to spare.#Dream11IPL pic.twitter.com/pwaVHhARS8
— IndianPremierLeague (@IPL) October 25, 2020
146 పరుగుల ఛేదనను ధాటిగా ప్రారంభించింది చెన్నై. ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే 5.1 ఓవర్లలో తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 25 పరుగులు చేసిన డుప్లెసిస్ ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(39)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన రుతురాజ్.. కెప్టెన్ ధోనీ(19)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో అర్థశతకం చేసి 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మోరిస్, చాహల్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. దేవ్‌దత్(22), ఫించ్(15), కోహ్లీ(50), డివిలియర్స్(39) రాణించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ 3, దీపక్ చాహర్ 2, శాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.