ఐపీఎల్ అంటే అందరూ సిక్సర్లు గురించే ఆలోచిస్తారు. కానీ ఫోర్లు కొట్టి రికార్డు సాధించొచ్చని ఓ బ్యాట్స్‌మన్ నిరూపించాడు. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఓ రికార్డు సాధించాడు. ఈ టోర్నీలో 500 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 153 మ్యాచ్‌లు ఆడాడీ క్రికెటర్. ఆ జాబితాలో 491 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు గౌతమ్ గంభీర్.
అత్యధిక ఫోర్లు కొట్టిన వారిలో తొలి పది మంది
1 | శిఖర్ ధావన్ | 502 ఫోర్లు |
2 | గౌతమ్ గంభీర్ | 491 |
3 | సురేశ్ రైనా | 473 |
4 | విరాట్ కోహ్లీ | 471 |
5 | డేవిడ్ వార్నర్ | 445 |
6 | రాబిన్ ఉతప్ప | 432 |
7 | రోహిత్ శర్మ | 407 |
8 | అజింక్య రహానే | 384 |
9 | క్రిస్ గేల్ | 360 |
10 | ఏబీ డివిలియర్స్ | 349 |