హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్-12 ఫైనల్లో ముంబయి జయకేతనం ఎగరవేసింది. నాలుగోసారి కప్పు గెల్చుకుంది. కానీ ఈ పోరులో పొలార్డ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 నేరం కింద అతడి మ్యాచ్ ఫీజులో 25% కోత విధించారు.
అసలేం జరిగిందంటే..?
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో పొలార్డ్ ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేస్తున్నాడు చెన్నై బౌలర్ బ్రావో. తొలి బంతికి పరుగేమి రాలేదు. తర్వాత వరుసగా రెండు బంతుల్ని ఆఫ్ స్టంఫ్ అవతల వేశాడు. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన పొలార్డ్.. నాలుగో బంతి వేసే క్రమంలో క్రీజు బయటకొచ్చి బ్యాట్‌ను గాల్లోకి విసిరాడు. అంపైర్లు అతడి దగ్గరికొచ్చి ఈ విషయమై మాట్లాడారు. మ్యాచ్‌లో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ చెప్పారు.
-
What's up with Pollard? https://t.co/jOpxpMmMmi via @ipl
— ebianfeatures (@ebianfeatures) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">What's up with Pollard? https://t.co/jOpxpMmMmi via @ipl
— ebianfeatures (@ebianfeatures) May 13, 2019What's up with Pollard? https://t.co/jOpxpMmMmi via @ipl
— ebianfeatures (@ebianfeatures) May 13, 2019
అనంతరం బ్యాటింగ్ చేసిన పొలార్డ్ మిగిలిన రెండు బంతుల్ని బౌండరీలకు పంపించాడు. ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లో 41 పరుగుల చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: బర్త్‌డే రోజు బ్యాట్‌ను గాల్లోకి విసిరిన పొలార్డ్.. !