వరుస విజయాలతో దూసుకెళ్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది చెన్నై. వరుసగా రెండు అపజయాలతో డీలా పడిన కోల్‌కతా మళ్లీ దూకుడు పెంచాలనుకుంటోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీటి మధ్య ఈడెన్‌గార్డెన్స్ వేదికగా నేటి సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఈ సీజన్లో చెన్నైతో ఓ మ్యాచ్‌లో ఓడింది కోల్‌కతా. సొంతగడ్డపై జరిగే ఈ పోరులో గెలవాలని పట్టుదలతో ఉంది. రసెల్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.
కోల్‌కతా నైట్ రైడర్స్..
దిల్లీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన కోల్‌కతా.. చెన్నైపై ఇది పునరావృతం కానివ్వకూడదని భావిస్తోంది. గత మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అర్ధశతకంతో రాణించాడు. రసెల్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది రైడర్స్. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రావాల్సిన అవసరముంది. దిల్లీతో మ్యాచ్‌లో రసెల్‌కు గాయమైంది. నేటి మ్యాచ్‌లో అతడు ఉంటాడా లేదా అనేది చూడాలి.
-
In tonight's episode of #KKRPrimeTime, we catch up with @gurneyhf, who mesmerised us with a magical debut vs Rajasthan Royals in Jaipur 💜
— KolkataKnightRiders (@KKRiders) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch this 📹 to know more about our Knight from England - https://t.co/7T9UmqeUWy#KKRHaiTaiyaar #VIVOIPL pic.twitter.com/38FwsTYQuP
">In tonight's episode of #KKRPrimeTime, we catch up with @gurneyhf, who mesmerised us with a magical debut vs Rajasthan Royals in Jaipur 💜
— KolkataKnightRiders (@KKRiders) April 13, 2019
Watch this 📹 to know more about our Knight from England - https://t.co/7T9UmqeUWy#KKRHaiTaiyaar #VIVOIPL pic.twitter.com/38FwsTYQuPIn tonight's episode of #KKRPrimeTime, we catch up with @gurneyhf, who mesmerised us with a magical debut vs Rajasthan Royals in Jaipur 💜
— KolkataKnightRiders (@KKRiders) April 13, 2019
Watch this 📹 to know more about our Knight from England - https://t.co/7T9UmqeUWy#KKRHaiTaiyaar #VIVOIPL pic.twitter.com/38FwsTYQuP
ప్రపంచకప్ బెర్త్ కోసం చూస్తున్న దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతడు సత్తా చాటాల్సిన అవసరముంది. బౌలర్లలో ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ నిలకడగా రాణిస్తున్నారు. కుల్దీప్, నరైన్, పియూష్ చావ్లాలతో స్పిన్ విభాగం బలంగా ఉంది.
చెన్నై సూపర్‌కింగ్స్
ఒక్క మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్‌తో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో చివర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు శాంట్నర్. అదే మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టి అంపైర్లతో వాగ్వాదం దిగినందుకు ధోనీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినా.. వివాదం సద్దుమణగట్లేదు.
-
Warming up for tomorrow's show at E-Den like...! #SuperPractice #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/paknVl1Xre
— Chennai Super Kings (@ChennaiIPL) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Warming up for tomorrow's show at E-Den like...! #SuperPractice #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/paknVl1Xre
— Chennai Super Kings (@ChennaiIPL) April 13, 2019Warming up for tomorrow's show at E-Den like...! #SuperPractice #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/paknVl1Xre
— Chennai Super Kings (@ChennaiIPL) April 13, 2019
బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న ధోనీ సేన రెండో సారి కూడా కోల్‌కతాను ఓడించాలనుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి అగ్రస్థానంలో ఉన్న చెన్నై మరోసారి అద్భుత ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్:
ధోని(కెప్టెన్), వాట్సన్, రాయుడు, రైనా, కేదార్ జాదవ్, జడేజా, డుప్లెసిస్, తాహిర్, హర్భజన్, కుగ్లిజిన్, చాహర్.
కోల్ కతా నైట్ రైడర్స్
దినేష్ కార్తీక్ (కెప్టెన్), పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, సునీల్ నరైన్, హారీ గున్రే, ఆండ్రీ రసెల్, క్రిస్ లిన్, కుల్దీప్ యాదవ్, నితీష్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ, శుభమన్ గిల్.