దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అక్టోబరు 24న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నట్లు స్పష్టం చేసింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో దాయాది జట్లు చివరిసారిగా పోటీపడ్డాయి. గ్రూప్2లో ఉన్న భారత్.. 31న న్యూజిలాండ్‌తో, నవంబరు 3న అఫ్ఘానిస్థాన్ తలపడనుంది.
ఒమన్‌తో పాటు యూఏఈలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నవంబరు 10, 11 తేదీల్లో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబరు 14న దుబాయ్‌లో ఫైనల్ జరగనుంది.