న్యూజిలాండ్ బాటలో ఇంగ్లాండ్ కూడా తమ దేశ పర్యటన(Pakistan Cricket Schedule 2021) నుంచి తప్పుకోవడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ రమీజ్ రజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లపై ప్రతీకారానికి సిద్ధం కావాలని తమ జట్టుకు రమీజ్(Ramiz Raja Statement) పిలుపునిచ్చాడు.
"ఇంగ్లాండ్ కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఇది ఊహించిందే. దురదృష్టవశాత్తూ ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఒకదానికి ఒకటి మద్దతుగా నిలుస్తాయి. ముందుగా తమకు తలెత్తిన ముప్పు గురించి ఏ సమాచారం పంచుకోకుండానే న్యూజిలాండ్ వెళ్లిపోవడం మాకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తమ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ జట్లు వచ్చినపుడు బాగా ముద్దు చేసే మాకు ఇదో గుణపాఠం. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మా దేశ పర్యటనపై పునరాలోచిస్తోంది. వెస్టిండీస్ జట్టు పర్యటన మీదా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇవన్నీ ఒకే సమూహంలో ఉంచాయి. మరి మేమెరికి ఫిర్యాదు చేయాలి. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా మా లక్ష్యం భారతే. ఇప్పుడు ఆ జాబితాలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ చేరాయి. తమకు మంచి చేయని జట్లపై మైదానంలో ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్ జట్టు మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి."
- రమీజ్ రజ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్
న్యూజిలాండ్(NZ Vs PAK Cancelled), ఇంగ్లాండ్ సిరీస్ల(ENG Vs PAK Cancelled) స్థానంలో తమతో ఆడేందుకు జింబాబ్వే సిద్ధంగా ఉందని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా వెల్లడించాడు. శ్రీలంక(PAK Vs SL), బంగ్లాదేశ్(BAN Vs PAK) కూడా జట్లను పంపడానికి సముఖత వ్యక్తం చేశాయని చెప్పాడు. కానీ, ఈ సిరీస్లను సర్దుబాటు చేయడానికి ఇబ్బందులున్నాయని రమీజ్ అన్నాడు.
ఇదీ చూడండి.. 'న్యూజిలాండ్ టీమ్ అంతు చూడాల్సిందే'