ETV Bharat / sports

2011 తర్వాత ఇదే తొలిసారి: కోహ్లీ - ఆర్​సీబీ ప్లేఆఫ్స్

2011 తర్వాత తమ జట్టు తొలిసారి ఐపీఎల్ లీగ్‌ దశలో పలు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌ చేరినట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (ipl 2021 virat kohli) సంతోషం వ్యక్తం చేశాడు. తమకింకా రెండు మ్యాచ్‌లు ఉండటం వల్ల పాయింట్ల పట్టికలో (rcb in playoffs or not) టాప్‌-2లో నిలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తపరిచాడు.

ipl 2021 virat kohli
ఐపీఎల్​ 2021 ఆర్​సీబీ
author img

By

Published : Oct 4, 2021, 10:56 AM IST

ఐపీఎల్‌(IPL 2021 News)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ipl 2021 virat kohli team) వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్‌కు(rcb in playoffs) చేరింది. ఈ సీజన్‌లో గతరాత్రి పంజాబ్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ 2011 తర్వాత తమ జట్టు తొలిసారి లీగ్‌ దశలో పలు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌ చేరినట్లు (rcb in playoffs 2021) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.

"12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (rcb in playoffs how many times) సాధించడం గొప్పగా ఉంది. ఇప్పుడు మాకింకా రెండు మ్యాచ్‌లు ఉండటం వల్ల పాయింట్ల పట్టికలో టాప్‌-2లో (rcb in playoffs list) నిలిచే అవకాశం ఉంది. అదే జరిగితే మాకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే, ఏ జట్టుకైనా తొలి అడ్డంకి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడమే. అది ఇప్పుడు మేం దాటేశాం. కానీ, మా ఆటలో దృష్టి సారించాల్సిన లోపాలున్నాయి. మిగతా మ్యాచ్‌ల్లో వాటిని సరిదిద్దుకొని టాప్‌-2లో నిలవడానికి ప్రయత్నిస్తాం. ఈ పిచ్‌పై 15-20 పరుగులు కూడా కీలకంగా మారతాయి. ఈ పిచ్‌ ఆడేకొద్దీ నెమ్మదిస్తుందని తెలుసు. ధాటిగా ఆడటం అంత తేలిక కాదని అర్థమైంది. ఇకపోతే పంజాబ్‌ జట్టులో రాహుల్‌, మయాంక్‌ బాగా ఆడారు. అయితే, ఈ రెండు వికెట్లు తీస్తే మళ్లీ మేం ఈ మ్యాచ్‌లో పుంజుకుంటామని తెలుసు. ఈ క్రమంలోనే మా బౌలర్లు సరైన సమయంలో చెలరేగి వికెట్లు తీశారు. సిరాజ్‌, హర్షల్‌, చాహల్‌, షాబాజ్‌, గార్టన్‌ అంతా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈసారి మా ఆటగాళ్లు ఎవరికి వారు సొంతంగా బాధ్యత తీసుకొని ఆడారు. అందుకు సంతోషంగా ఉంది" అని విరాట్‌ తెలిపాడు.

మా బౌలర్లను తప్పుబట్టలేం: రాహుల్‌

ఇక ఈ ఓటమితో ప్లేఆఫ్స్‌ అర్హత కోల్పోయిన పంజాబ్‌ (ipl 2021 rcb vs punjab) కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా టాప్‌ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తుండటం వల్ల ఆరెంజ్‌ క్యాప్‌ తన వద్దకు వస్తోందని, అయితే తాము ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరు మంచి స్కోరే సాధించిందని.. మరో 10-15 పరుగులు అదనంగా సాధించారని వివరించాడు. అలాగే మాక్స్‌వెల్‌ చెలరేగితే ఎవరూ ఏమీ చేయలేరన్నాడు. ఈ విషయంలో బౌలర్లను పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నాడు. మరోవైపు తమ జట్టు బ్యాటింగ్‌ కూడా సరిగ్గా లేదని విచారం వ్యక్తం చేశాడు.

"క్రికెట్‌ అనేది జట్టుగా ఆడే ఆట. జట్టుకు అవసరమైన రీతిలో మేం బ్యాటింగ్‌ చేస్తాం. టీ20ల్లో ఓపెనర్లే ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంటుంది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఒక సీజన్‌లో 500-600 పరుగులు చేయలేరు. అయితే, ఏ జట్టుకైనా మధ్యలో పరుగులు చేసే ఆటగాళ్లు ఉండాలి. మా జట్టులోని యువకులు బాగా ఆడుతున్నారు. షారుఖ్‌, రవి బిష్ణోయ్‌, అర్షదీప్, హర్‌ప్రీత్‌ లాంటి ఆటగాళ్లు నాలుగైదు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. వాళ్లు మనసుపెట్టి ఆడటం చూస్తుంటే గొప్పగా ఉంది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో ఎలా పరుగులు చేయాలో ఆలోచించాలి" అని పంజాబ్‌ కెప్టెన్ వివరించాడు.

ఇదీ చదవండి:ఎలాగో పోటీలో లేము.. అందుకే అలా: కేన్‌ విలియమ్సన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.