ETV Bharat / sports

ముంబయిలోనూ 'ధోనీ' మేనియా.. సింహం ఎక్కడైనా సింహమే! - ముంబయి ఇండియన్స్​

ఎంఎస్‌ ధోనీ.. క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్‌. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా షాట్లు బాది తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించడంలో తనకు తానే సాటి. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ధోనీ ఆటకు ముగ్ధులైపోయారు.​ అద్భుతమైన​ ఇన్నింగ్స్​తో తనలో ఇంకా మునుపటి సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు మహీ​. కాగా, గతరాత్రి జరిగిన మ్యాచ్​లో కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Dhoni mania in mumbai
Dhoni mania in mumbai
author img

By

Published : Apr 22, 2022, 3:07 PM IST

MS Dhoni: సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా అంతే.. అతడు చెన్నైలో ఛేదించినా.. దుబాయ్‌లో దూకుడుగా ఆడినా.. ముంబయిలో మురిపించినా.. ఎక్కడైనా ఒక్కటే తీరు. ప్రశాంతంగా ఉంటూ తన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే అతడికి తెలిసింది. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ అదే చేశాడు. దీంతో అతడిని 'గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో తనలో ఇంకా మునుపటి సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు. ఈ మ్యాచ్‌లోని పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

MS Dhoni Fans: అభిమానం అంటే ఇదీ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆటగాడు చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ. అతడు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అది చెన్నై, దుబాయ్‌, ముంబయి.. ఎక్కడైనా సరే. మరీ ముఖ్యంగా తన సొంత ఊరు రాంచీ కన్నా.. చెన్నై అభిమానులే మహీ పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తారు. అది ముంబయితో నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించింది. డీవైపాటిల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. స్థానిక జట్టు అభిమానుల కన్నా చెన్నై అభిమానులే సందడి చేశారు.

నువ్వే మా సారథి.. మహీ క్రీజులోకి వచ్చినప్పుడు స్టాండింగ్‌ ఓవియేషన్‌తో ఘన స్వాగతం పలికిన అభిమానులు.. చివరి బంతికి అతడు ఫోర్ కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చేంతవరకూ 'ధోనీ' పేరును స్టేడియంలో మార్మోగించారు. స్టేడియంలో ఏ మూలన చూసినా అతడి అభిమానులే. చెన్నై జెండాను ఊపుతూ ఆ జట్టుకు పూర్తి మద్దతు పలికారు. ఇక 20వ ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరమైన వేళ వాళ్ల సందడి అంతా ఇంతా కాదు. స్టేడియం మొత్తం ధోనీ ధోనీ అనే నామ స్మరణతో సందడి నెలకొంది. ఇప్పుడు జడేజా కెప్టెన్‌ అయినా, మహీనే మా సారథి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

నమ్మకాన్ని నిలబెట్టుకొని.. ముంబయి ఈ మ్యాచ్‌లో 155 పరుగులే చేసినా ఆ స్కోరును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను చివరివరకూ నడిపించారు. దీంతో ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చెన్నై గెలవడానికి బాగా కష్టపడింది. జయదేవ్‌ ఉనద్కత్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికే ప్రిటోరియస్‌ (23) వికెట్‌ పడగొట్టి చెన్నై అభిమానుల్లో కాస్త కంగారు పెట్టించాడు. అయితే, వాళ్లకు ధోనీ ఉన్నాడనే నమ్మకం ఉంది. దీంతో వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

ఒత్తిడినే చిత్తు చేస్తూ.. ఆఖరి ఓవర్‌లో పరిస్థితులు కఠినంగా ఉన్నా ధోనీ చాలా కూల్‌గా కనిపించాడు. తన ముఖంలో ఏమాత్రం ఆందోళన, తడబాటు కనపడలేదు. అలా కనిపిస్తే అతడు ధోనీ ఎందుకవుతాడు! తొలి బంతికే వికెట్‌ పడ్డాక క్రీజులోకి వచ్చిన బ్రావో(1) సింగిల్‌ తీసిచ్చాడు. దీంతో బ్యాటింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన ధోనీ.. మిగతా నాలుగు బంతుల్లో 16 పరుగులు సాధించాడు. మూడో బంతిని లాంగాఫ్‌ మీదుగా సిక్సర్‌ సంధించిన తర్వాత.. నాలుగో బంతిని డీప్‌ ఫైన్‌లెగ్‌లో బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి.. ఆఖరి బంతిని లాంగ్‌ లెగ్‌లోకి దంచికొట్టాడు. అంతే చెన్నైకి అపురూప విజయాన్ని అందించాడు. చివరికి గావస్కర్‌ కూడా మహీ ఆటకు ఫిదా అయ్యాడు. అతడిలా ఆడితే ఎవరూ ఏం చేయలేరన్నాడు.

జడేజా తలవంచి గౌరవించి‌.. చెన్నై జట్టుకు ఇప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్‌ అయినా ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు. మ్యాచ్‌ గెలిచాక మైదానంలోకి వచ్చిన జడ్డూ తన మాజీ సారథి ముందు తన క్యాప్‌ తీసి తలవంచి నమస్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీంతో జడ్డూ.. ధోనికి ఎంత విలువ ఇస్తాడో తెలిసొచ్చింది. మీరూ ఆ వీడియోలు చూసేయండి.

ఇవీ చదవండి: ధోనీ 'ఫినిష్‌' అనుకున్నావా.. ఫినిషర్‌.. సోషల్​ మీడియాలో ట్రెండింగ్​

ధోనీపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. వేలెత్తి చూపలేమంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.