ETV Bharat / sports

T20 World Cup: 'చాహల్‌ ఏమైనా టూర్‌కు వచ్చాడా? కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా..'

టీ20 ప్రపంచకప్‌-2022 సెమీఫైనల్లో టీమ్​ఇండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే వరల్డ్​ కప్​ జట్టుకు ఎంపికైన చాహల్​ను ఒక్క మ్యాచ్​లో​ కూడా ఆడించకపోవడంపై మేనేజ్​మెంట్​ను నెటిజన్లు తెగ ట్రోల్​ చేస్తున్నారు.

t20 world cup indian bowler yuzvendra chahal not played in single match

author img

By

Published : Nov 10, 2022, 10:41 PM IST

T20 World Cup 2022 Yuzvendra Chahal: టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో భారత జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. ఇంగ్లాండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్‌.. టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. భారత్‌ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఇంగ్లాండ్‌ చేధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు.

ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను కేవలం బెంచ్‌కే పరిమితం చేశారు. కాగా ఈ ప్రపంచకప్‌లో హసరంగ, అదిల్‌ రషీద్‌, జంపా, రషీద్‌ ఖాన్‌ వంటి మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కాగా స్పిన్నర్లుగా భారత జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ తీవ్రంగా నిరాశ పరిచారు. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో 4 ఓవర్లలో అక్షర్‌ పటేల్‌ 30 పరుగులు ఇవ్వగా.. అశ్విన్‌ రెండు ఓవర్లలోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ క్రమంలో కేవలం ఒక్క మ్యాచ్‌లో కూడా చాహల్‌కు అవకాశం ఇవ్వకపోవడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చాహల్‌ ఏమైనా టూర్‌కు వచ్చాడా? కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. కాగా టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా చాహల్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.