యూఏఈ వేదికగా అక్టోబర్ 24న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (India Vs Pak T20 World Cup 2021) తలపడనున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహ్మూద్ (Azhar Mahmood News). ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం టీమ్ఇండియా క్రికెటర్లు యూఏఈలోనే (IPL In UAE) ఉండటం వారికి సానుకూలత చేకూర్చుతుందని అన్నాడు.
"భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎప్పటికీ ప్రత్యేకమే. ఏ రోజు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం. అయితే టీమ్ఇండియాకు ఒక సానుకూలత ఉంది. వారి క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ఆడబోయే యూఏఈ వేదికల్లోనే ఐపీఎల్లో ఆడారు. పోటీతత్వ క్రికెట్ ఆడటం సహా అక్కడి పరిస్థితులపై వారికి మంచి అవగాహన ఉంటుంది."
- అజహర్ మహ్మూద్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
ప్రపంచకప్ చరిత్రలో (India Vs Pakistan World Cup History) పాకిస్థాన్‌పై ఎప్పుడూ భారత్‌దే పైచేయి. వన్డే టోర్నీలో ఏడుకు ఏడు మ్యాచ్‌లు, టీ20 ఫార్మాట్లో మొత్తం 5 మ్యాచులను టీమ్ఇండియానే కైవసం చేసుకుంది. భారత్-పాక్ చివరిసారిగా 2016లో కోల్‌కతాలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాయి. అందులో అన్ని విభాగాల్లో పాక్‌ను చిత్తుచేసింది టీమ్ఇండియా.
మాకు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు..
అయితే ప్రస్తుత పాకిస్థాన్ జట్టులో (T20 World Cup 2021 Pakistan Squad) బాబర్ అజామ్, షోయమ్ మాలిక్, మహ్మద్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్ అఫ్రిదీ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అన్నాడు మహ్మూద్. ఈ జట్టుపై పాక్ అభిమానులు పూర్తి నమ్మకం ఉంచవచ్చని చెప్పాడు. న్యూజిలాండ్ పర్యటన రద్దు కారణంగా ఇటీవలే ఆడిన జాతీయ టీ20 కప్‌తో పాక్‌కు గొప్ప ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు.
ఇదీ చూడండి: T20 Worldcup: 'అలా చేస్తేనే టీమ్ఇండియా గెలుస్తుంది'