మహిళల ఆసియా కప్‌లో భారత్ జట్టు అదరగొడుతోంది. తాజాగా థాయ్‌లాండ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్.. భారత బౌలింగ్ ధాటికి తట్టుకోలేక 15.1 ఓవర్లలో 37 పరుగులు చేసి చేతులెత్తేశారు. ఓపెనర్ ఎన్ కొంచెరోఎంకయ్ 12 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. మిగతా వాళ్లందరూ పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్ స్కోరు చేసి పెవిలియన్ చేరారు. అందులో నలుగురు బ్యాటర్లు ఒక్క పరుగు కూడా తీయకుండా వెనుదిరిగారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్.. కేవలం ఆరు ఓవర్లులో ఒక వికెట్ నష్టానికి 40 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. అందులో ఓపెనర్ సబ్బినేని మేఘన అద్భుతంగా రాణించింది. 18 బంతుల్లో 20 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలి వర్మ 6 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. అనంతరం వచ్చిన పూజ వస్త్రాకర్ 12 బంతుల్లో 12 పరుగులు చేసి.. మేఘనతో కలిసి మ్యాచ్‌ను ముగించింది.
భారత మహిళల జట్టు ఆసియా కప్‌ను అద్భుతంగా ఆరంభించింది. మధ్యలో పాకిస్థాన్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఓటిమిపాలైనా.. మళ్లీ పుంజుకుని బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తాజాగా థాయ్‌లాండ్‌పై కూడా విజయం సాధించింది. దీంతో మహిళల ఆసియా కప్ పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.
ఇవీ చదవండి: నేను 'గే'.. స్టార్ ఫుట్‌బాలర్ సంచలన ట్వీట్.. ఆ తర్వాత సూపర్ ట్విస్ట్!
ఇంజినీరింగ్ వదిలేసి.. ఐపీఎల్లో సత్తా చాటి.. అంతర్జాతీయ క్రికెట్లో 'షాబాజ్' అరంగేట్రం!