Young Man Suicide in RTC Bus : ఎవరూ ఊహించని విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ యువకుడికి ఏ కష్టం వచ్చిందో ఎమో తెలీదు కానీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ భయాందోళనకు గురయ్యారు.
బస్సు చివరిలో కూర్చోని ఆత్మహత్య : కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్తున్న పల్లే వెలుగు ఆర్టీసీ బస్సులో ఏర్పేడు సమీపంలో ఓ యువకుడు ఎక్కాడు. యువకుడు వెనుక సీట్లో కూర్చున్నాడు. ఆ సమయంలో బస్సులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో వారు ముందు సీట్లలో కూర్చున్నారు. ఈ తరుణంలో వెనుక సీట్లు ఉన్న యువకుడు కదులుతున్న బస్సులో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగ్గా, రేణిగుంట దగ్గరకు చేరుకున్నాక కండక్టర్ గమనించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి అనంతరం కండక్టర్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
క్షణికావేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు - తప్పిదమెక్కడో గుర్తించకుంటే తీవ్ర నష్టమే!
బస్సులో యువతికి మూర్ఛ : బస్సులో ప్రయాణిస్తున్న యువతి ఒక్కసారిగా కదలిక లేకుండా పోయిన ఘటన మన్యం జిల్లా సాలూరు ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. వివరాళ్లోకెళ్తే సాలూరు ఆర్టీసీ బస్సులో ఆ యువతి ప్రయాణిస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కదలిక లేకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అమ్మాయి కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులు, బస్ కండక్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మన్యం జిల్లా సాలూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం సమీపంలోకి రాగానే ఓ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తోటి ప్రయాణికులు గుర్తించి, బస్సు సిబ్బందికి తెలపడంతో ఆర్టీసీ బస్సుతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలో యువతికి మూర్ఛ వ్యాధి వచ్చిందని ఆసుపత్రికి వచ్చిన ఆమె బంధువులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత యువతి కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎంబీబీఎస్ సీటు సాధించి వారం కాలేదు - అనారోగ్యంతో ఆత్మహత్యాయత్నం చేసింది
ఆ యువకుడి వేధింపుల వల్లే నా చిట్టితల్లి ఆత్మహత్య చేసుకుంది - భువనగిరిలో యువతి మృతిపై తండ్రి ఫిర్యాదు