IND VS Zimbabwe First ODI highlights జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా ఛేదించింది. దీంతో ఈ ఏడాదిలో రెండు సార్లు పది వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. అంతేకాకుండా మరికొన్ని రికార్డులను కూడా సాధించింది. అవేంటంటే..
- భారత్ అత్యధికంగా 13(2013-22) వన్డేల్లో వరుస విజయాలను జింబాబ్వేపై సాధించింది. ఒకే జట్టుపై ఇన్ని విజయాలు సాధించడం విశేషం. అంతకుముందు వరుసగా బంగ్లాదేశ్‌పై(1988-04) 12సార్లు, న్యూజిలాండ్‌పై(1986-88) 11 సార్లు గెలిచింది.
- వన్డేల్లో ఛేజింగ్‌లో పది వికెట్ల విజయాల్లో రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే(192/0). అంతకుముందు 1998లో జింబాబ్వే పైనే 197/0 తేడాతో విజయం సాధించింది భారత్. 2016లోనూ జింబాబ్వేపై 126/0, 1975లో ఈస్ట్ ఆఫ్రికాపై 123/0, 1997లో వెస్టిండీస్‌పై 116/0, 2022లో ఇంగ్లాండ్‌పై 114/0, 1984లో శ్రీలంకపై 97/0 , 2001లో Kenya Bloemfonteinపై 91/0 తేడాతో గెలిచింది.
- వన్డేల్లో 6500 పరుగులను పూర్తి చేసుకున్న ఐదో భారత బ్యాటర్‌గా శిఖర్ ధావన్(6574) గుర్తింపు తెచ్చుకున్నాడు.
- ఈ మ్యాచ్‌లో 10 ఫోర్లతో ఓ సిక్స్‌తో రెచ్చిపోయిన గిల్ 82 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏడు వన్డేలు ఆడిన అతడ తాజా దాంతో కలిపి మూడు అర్ధశతకాల్ని నమోదు చేశాడు.
- గత నాలుగు ఇన్నింగ్స్‌లో ధావన్- గిల్ మూడు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని(119, 48, 113, 192) నమోదు చేశారు.
- ఒకే ఏడాదిలో భారత్ రెండు సార్లు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 113 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా ఛేదించింది.
- ఇప్పటి వరకు భారత్ ఎనిమిది సార్లు పది వికెట్ల తేడాతో విజయాలను నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ (3/27), అక్షర్ పటేల్ (3/24), ప్రసిద్ధ్ కృష్ణ (3/50) విజృంభించడంతో మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ చకబ్వ (35; 51 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్. ఎంగరవ (34; 42 బంతుల్లో 3×4, 1×6), ఎవాన్స్ (33 నాటౌట్; 29 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ఛేదన టీమ్‌ఇండియాకు నల్లేరుపై నడకే అయింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (82 నాటౌట్; 72 బంతుల్లో 10×4, 1×6), ధావన్ (81 నాటౌట్; 113 బంతుల్లో 9×4) చెలరేగడంతో 30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే శనివారం జరుగుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: తొలి వన్డేలో జింబాబ్వే చిత్తు, 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం