శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో ఛేదించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 2-0 తేడాతో ఒక మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. తొలి వన్డేలో రాణించిన రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (21), విరాట్ కోహ్లీ (4) ఈ సారి నిరాశ పరిచారు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (64; 103 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్ పాండ్య (36; 53 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. శ్రేయస్ అయ్యర్ (28), అక్షర్ పటేల్ (21) ఫర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, చమిక కరుణరత్నె చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. కసున్ రజిత, ధనంజయ డిసిల్వా తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నువనిదు ఫెర్నాండో (50) అర్ధ శతకంతో రాణించగా.. కుశాల్ మెండిస్ (34), దునిత్ వెల్లలాగె (32) ఫర్వాలేదనిపించారు. వానిందు హసరంగ(21), అవిష్క ఫెర్నాండో (20), చరిత్ అసలంక (15), , చమీక కరుణరత్నె (17), రజిత (17), డాసున్ శనక (2) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో (437) పరాజయం చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్, శ్రీలంక 436 ఓటములతో సమానంగా ఉండేవి.
ఇదీ చూడండి: Hockey World Cup 2023: ప్రపంచకప్ సమరానికి భారత్ సై.. 48 ఏళ్ల నిరీక్షణకు తెర పడేనా?