ETV Bharat / sports

టీమ్​ఇండియా జోరు.. ఈ మ్యాచ్​ గెలిస్తే సిరీస్​ మనదే - టీమ్​ఇండియా రెండో టీ20

IND vs SL 2nd T20: విండీస్​తో వన్డే, టీ20 సిరీస్​లో కరీబియన్లను ఓడించి వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్​ఇండియా, శ్రీలంకను కూడా అలానే చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడి, భారత్​తో తొలి టీ20లోనూ ఓటమి పాలైన శ్రీలంక.. రెండో టీ20తో పుంజుకోవాలని చూస్తోంది.

srilanka t20
శ్రీలంక టీ20
author img

By

Published : Feb 26, 2022, 5:31 AM IST

Updated : Feb 26, 2022, 7:03 AM IST

IND vs SL 2nd T20: స్వదేశంలో వెస్టిండీస్‌పై ఇటీవలే టీ20 సిరీస్‌ గెలిచిన టీమ్​ఇండియా.. శ్రీలంకపై కూడా అదే పునరావృతం చేయాలని భావిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసిన రోహిత్​సేన.. శనివారం రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ చేరకుండానే ఇంటిదారి పట్టిన భారత్‌.. అవసరమైన మార్పులతో బలమైన జట్టును తయారు చేసుకునే పనిలో పడింది. కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తూ ఏ స్థానంలోనైనా ఆడగలిగేలా ఆటగాళ్లను తీర్చిదిద్దుతోంది. విండీస్‌తో సిరీస్‌లో ఆశించిన మేర రాణించని ఇషాన్‌ కిషన్‌.. లంకతో మ్యాచ్​లో ఫామ్‌లోకి రావడం పట్ల జట్టు సంతోషంగా ఉంది. గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు ఫిట్‌నెస్‌ సాధిస్తే ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి రాణించిన శ్రేయస్ అయ్యర్ అదే స్థానంలో రానున్నాడు. జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రానున్నాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. భారత బౌలింగ్ దళం సైతం బలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కెప్టెన్‌ ఏడుగురు బౌలర్లను వినియోగించుకోవడం శుభపరిణామం. టీ20ల్లో వరుసగా 10 మ్యాచుల్లో గెలిచిన టీమ్​ఇండియాను ఓడించాలని శ్రీలంక భావిస్తోంది. ధర్మశాల వేదికగా శనివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

జట్లు

టీమ్​ఇండియా : రోహిత్​ శర్మ (కెప్టెన్), ఇషాన్​ కిషన్ (వికెట్​ కీపర్), శ్రేయస్​ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, దీపక్​ హుడా, వెంకటేశ్​ అయ్యర్​, హర్షల్​ పటేల్, భువనేశ్వర్​ కుమార్, బూమ్రా, చాహల్, రుతురాజ్​ గౌక్వాడ్, రవి బిష్ణోయ్, ఆవేశ్​ ఖాన్, సిరాజ్, కులదీప్​ యాదవ్

శ్రీలంక : పతుమ్​ నిశాంక, దినేశ్​ చండీమాల్, జనిత్​ లియనాగే, శనక, కరుణరత్నె, చమీర, జయవిక్రమ, వాండర్సే, లహిరు కుమార, గుణతిలక, అశియన్​ డేనియల్స్ షిరాన్​ ఫెర్నాండో, బినురా ఫెర్నాండో

ఇదీ చూడండి : టీమ్‌ఇండియా టీ20 రికార్డ్.. వరుసగా పది మ్యాచ్​ల్లో

Last Updated : Feb 26, 2022, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.