కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో శ్రీలంక జట్టు టీమ్ఇండియాకు 276 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికట్లు కోల్పోయి 275 రన్స్ చేసింది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు సాధించగా.. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు.
కీలక ఇన్నింగ్స్
ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(50), మినోద్ భానూక(36) రూపంలో శుభారంభం దక్కింది. అవిష్క హాఫ్‌సెంచరీతో మెరవగా.. అంతలోనే అవిష్క-మినోద్ భాగస్వామ్యాన్ని చాహల్ విడగొట్టాడు. ఆ తర్వాత వెంటనే బ్యాటింగ్ వచ్చిన భానూక రాజపక్సాను డకౌట్‌గా వెనుదిరిగేలా బంతిని సంధించాడు చాహల్. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ధనుంజయ డీ సెల్వా(32), కెప్టెన్ దుసన్ శనకా(16), వానిదు హసరంగా(8) లంక స్కోరుబోర్డును కదిలించడంలో కష్టపడ్డారు. ఆ తర్వాత వచ్చిన చారిత్ అసలంక, కరుణరత్నేలు స్కోర్‌బోర్డును పరగులు పెట్టించారు. ఈ క్రమంలోనే అసలంక (65) అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. కరుణరత్నె44పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి.. IND vs SL: జోరు మీద టీమ్ఇండియా.. గెలుపు ఆశతో శ్రీలంక