ETV Bharat / sports

ఆ స్థానంలో ఎవరనేది తేల్చడం కష్టమే: కేఎల్ రాహుల్​ - భారత్​ వెస్​ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్​

IND vs SA test series: దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని అనుకుంటున్నామని టీమ్​ఇండియా వైస్​కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ చెప్పాడు. అలాగే రహానె, శ్రేయస్​ అయ్యర్​లలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలో నిర్ణయించుకోవడం సవాలుగా మారిందని అన్నాడు.

KL Rahul
KL Rahul
author img

By

Published : Dec 24, 2021, 7:18 PM IST

IND vs SA: ఇప్పటివరకు విదేశాల్లో టీమ్​ఇండియా టెస్టు సిరీస్‌ను గెలవని ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. అందుకే ఈసారి ఎలాగైనా సరే గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాలని భావిస్తుంది కోహ్లీసేన. ఈ మేరకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఇంకో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్​లో టీమ్​ఇండియా ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు వైస్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ తెలిపాడు.

IND vs SA Test series: డిసెంబరు 26న ప్రారంభమయ్యే తొలి టెస్టు​లో టీమ్​ ఇండియా శుభారంభం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వర్చువల్​గా జరిగిన విలేకర్లు సమావేశంలో.. నలుగురు బౌలర్లతో ఆడితే పనిభారం పెరుగుతుందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సానుకూలంగా బదులిచ్చాడు రాహుల్​.

"ప్రతిజట్టు టెస్టు​లో గెలవడానికి 20 వికెట్లు తీయాలని భావిస్తుంది. మేమూ అదే వ్యూహాంతో ముందుకెళ్తాం. అలా ఆడిన ప్రతిసారి కలిసొచ్చింది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే పనిభారం కాస్త తగ్గుతుంది. కాబట్టి ఆ వ్యూహంతో టెస్టు మ్యాచ్​ ఆడాలనే యోచిస్తున్నాం" అని రాహుల్​ పేర్కొన్నాడు. దీంతో నాలుగో పేసర్​ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.

ఐదోస్థానంలో ఎవరిని పంపాలో?

KL Rahul on Rahane: మరోవైపు అజింక్యా రహానె, శ్రేయస్​ అయ్యర్​లలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలో తేల్చుకోవడం సవాలుగా మారిందని కేఎల్ రాహుల్ అన్నాడు.

"ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. టెస్టు టీమ్​లో రహానె కీలక ఆటగాడు. అతని కెరీర్​లో ఎన్నో కీలక మ్యాచ్​లు ఆడాడు. గడిచిన 15 నుంచి 18 నెలల్లో జరిగిన మ్యాచ్​లోనూ జట్టు ఆపదలో ఉన్నప్పుడు తన సత్తా చాటాడు. మరోవైపు శ్రేయస్​ అయ్యర్​.. అరంగేట్ర టెస్టు మ్యాచ్​లో సెంచరీ, అర్ధ సెంచరీతో చెలరేగి.. మంచి ఉత్సాహంతో ఉన్నాడు. హనుమ విహారి కూడా ఇదే ఊపు కనబరుస్తున్నాడు. కాబట్టి ఎవరిని టీమ్​లోకి తీసుకోవాలన్నది కఠిన సవాలే"

- వైస్​కెప్టెన్​ కేఎల్​ రాహుల్​

గాయం కారణంగా టెస్టు సిరీస్​కు రోహిత్​ శర్మ దూరమవగా.. వైస్​కెప్టెన్​ బాధ్యతలను రాహుల్​కు అప్పగించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రాహుల్​.. 'నేను ఎప్పుడూ బాధ్యతలను ఆస్వాదిస్తాను. ఓపెనర్​గా శుభారంభం అందించాల్సిన బాధ్యత ఉంది. అలాగే సారథి విరాట్​పై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరముందని భావిస్తున్నాను' అని​ పేర్కొన్నాడు.

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

ఇదీ చూడండి: 'కోహ్లీకి బౌలింగ్ చేయడం కష్టమే.. కానీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.