IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 266 పరుగులకే పరిమితమైంది భారత్. రహానే (58), పుజారా (53) అర్ధశతకాలతో రాణించారు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు లభించలేదు. చివర్లో విహారి (40*) పోరాడటం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు పరిమితమైన భారత జట్టు.. సఫారీల ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. పుజారా (53), రహానె (58) మంచి లయతో పరుగులు రాబట్టారు. కోల్పోయిన ఫామ్‌ను అందుకుని ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. వీరద్దరూ కలిసి 111 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో పుజారా, రహానెతోపాటు రిషభ్ పంత్ (0) పెవిలియన్‌కు చేరడం వల్ల టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. అయితే కాస్త దూకుడుగా ఆడిన అశ్విన్ (16) లంచ్ బ్రేక్‌కు ముందు పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్, హనుమ విహారి మరో వికెట్ పడనీయకుండా జాగ్రత్తగా ఆడారు. లంచ్ తర్వాత జోరు పెంచిన శార్దూల్ భారీ షాట్లు ఆడాడు. ఇదే ఊపులో ఉండగా ఇతడిని 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ చేశాడు జాన్సెన్. చివర్లో విహారి (40*)టెయిలెండర్లతో కలిసి కాసేపు పోరాడాడు. దీంతో 266 పరుగులు చేయగలిగింది భారత జట్టు.
భారత్‌కు కలిసొచ్చే అంశమిదే..
జోహన్నెస్‌బర్గ్‌లో ఇప్పటివరకు 220కి పైగా పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు సౌతాఫ్రికా. 2006లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై 220 పరుగుల్ని ఛేదించి విజయం సాధించింది సఫారీ జట్టు. ఇది టీమ్ఇండియాకు అనుకూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.