ETV Bharat / sports

టెస్టు క్రికెట్​కు టీమ్ఇండియా అంబాసిడర్: శాస్త్రి

IND vs NZ Test: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గెలుపొందిన టీమ్ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు భారత జట్టు రాయబారిగా మారిందని పేర్కొన్నాడు.

ravi shastri latest news, ravi shastri on team india, రవిశాస్త్రి లేటెస్ట్ న్యూస్, రవిశాస్త్రి టీమ్ఇండియా
ravi shastri
author img

By

Published : Dec 7, 2021, 9:17 AM IST

IND vs NZ Test: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టును మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసించాడు. టీమ్‌ఇండియా ఐదారు సంవత్సరాలుగా మెరుగ్గా రాణిస్తోందని, ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు రాయబారిగా మారిందని పేర్కొన్నాడు. రెండో టెస్టులో భారత్‌ 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడంతో.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడంపై స్పందించిన శాస్త్రి ఈ విధంగా మాట్లాడాడు.

Ravi Shastri Best Indian Team: "టెస్టు క్రికెట్టుకు ఏ జట్టైనా అంబాసిడర్‌గా మారిందంటే.. అది కచ్చితంగా టీమ్‌ఇండియానే. భారత జట్టులో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సహా చాలా మంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. అందుకే, ఐదారు ఏళ్లుగా భారత్ టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో మేం ఓడిపోయి ఉండొచ్చు. అయినా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా కొన్నేళ్లుగా ఆదిపత్యం చెలాయిస్తోందంటే కారణం టెస్టు క్రికెట్‌ పట్ల ఆటగాళ్లకున్న ఆసక్తే. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో యువ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు, టెస్టు క్రికెట్‌ పట్ల వారికున్న అభిమానం చూస్తుంటే.. టీమ్‌ఇండియా వారసత్వాన్ని నిలబెడతారనిపిస్తోంది" అని రవిశాస్త్రి అన్నాడు.

ఇవీ చూడండి: యాషెస్​ పిలుస్తోంది.. కదనోత్సాహంతో ఆసీస్-ఇంగ్లాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.