ETV Bharat / sports

IND Vs NZ Test: లాథమ్, యంగ్ హాఫ్ సెంచరీలు.. రెండోరోజు కివీస్​దే! - భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు భారత్ ఇన్నింగ్స్

భారత్-న్యూజిలాండ్​ మధ్య కాన్పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test live score) రెండో రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్​లో భారత్ 345 పరుగులకు ఆలౌట్​ కాగా.. కివీస్​ ప్రస్తుతానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 రన్స్ వెనుకంజలో ఉంది.

భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు హైలైట్స్, భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు లైవ్, IND vs NZ test live score, IND vs NZ test second day
భారత్-న్యూజిలాండ్
author img

By

Published : Nov 26, 2021, 4:45 PM IST

Updated : Nov 26, 2021, 9:03 PM IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test live score) రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్​నైట్ స్కోర్ 258 వద్ద రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 345 పరుగులకు ఆలౌటైంది. కెరీర్​లో తొలి టెస్టు ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీతో అదరగొట్టాడు. ఇతడికి తోడు జడేజా (50), అశ్విన్ (38) పోరాటడం వల్ల 345 పరుగులు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో సౌథీ 5 వికెట్లతో రెచ్చిపోగా, జేమిసన్ 3, అజాజ్ పటేల్ 2 రెండు వికెట్లు సాధించారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్​కు ఓపెనర్లు టామ్ లాథమ్(50*), విల్ యంగ్(75*) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇవీ చూడండి: యాషెస్ మ్యాచ్​లు ఇక తెలుగులో.. ఇదే తొలిసారి

Last Updated : Nov 26, 2021, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.