Ind vs Aus T20 : వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. 5 మ్యాచ్‌ల సిరీస్, నేడు (నవంబర్ 23) విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో కుర్రాళ్లతో కూడిన టీమ్ఇండియా.. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు అసలైన సవాల్ ఎదుర్కోనుంది.
టీ20 వరల్డ్ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్.. ఇప్పుడు కెప్టెన్‌గానూ నిరుపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో అంతగా ప్రభావం చూపని సూర్య.. టీ20ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సూర్యతో పాటు వరల్డ్‌కప్‌లో ఆడిన ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. మెగాటోర్నీలో ఇషాన్.. రెండు మ్యాచ్‌ల్లో ఆడగా.. ప్రసిద్ధ్‌కు ఆ ఛాన్స్ కూడా రాలేదు. ఇక చివరి రెండు టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఎలాంటి జట్టుతో టీమ్ఇండియా బరిలోకి దిగనుందోనని ఆసక్తి రేపుతోంది. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా ఎలాగు జట్టులో ఉంటాడు. మరి యశస్వితో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసేదెవరు? ఓపెనింగ్‌కు ఇషాన్ వస్తాడా? లేదా వైస్ కెప్టెన్ రుతురాజ్.. యశస్వితో జతకడతాడా? అనేది ప్రశ్న.
కెప్టెన్ సూర్య వన్‌డౌన్‌లో రావచ్చు. ఇక నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్ ఆడే ఛాన్స్ ఉంది. బౌలింగ్‌లో ముకేశ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కవచ్చు. ఒకవేళ అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చినా ఆశ్చర్యం లేదు.
-
Geared up for #INDvAUS T20I series opener 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/Zvdsi6Ff7b
— BCCI (@BCCI) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Geared up for #INDvAUS T20I series opener 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/Zvdsi6Ff7b
— BCCI (@BCCI) November 22, 2023Geared up for #INDvAUS T20I series opener 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/Zvdsi6Ff7b
— BCCI (@BCCI) November 22, 2023
మరిన్ని విషయాలు
- ఆస్ట్రేలియా విశాఖ స్టేడియంలో ఇప్పటివరకు 5 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆడింది. అందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచి ఒకదాంట్లో ఓడింది.
- భారత్ - ఆస్ట్రేలియా మధ్య 26 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ 15 , ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్టు (అంచనా)..
భారత్ : ఇషాన్ (వికెట్‌కీపర్), యశస్వి, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్/సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్/అవేష్, ముకేశ్.
ఫస్ట్ ప్లేస్‌పై కోహ్లి కన్ను - వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఏ పొజిషన్లో ఉన్నాడంటే?
భారత్‌తో అఫ్గాన్ తొలి ద్వైపాక్షిక సిరీస్- టీమ్ఇండియా నెక్స్ట్ టార్గెట్ అదే!