ETV Bharat / sports

భారత్ x ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ - నమోదైన రికార్డులు, హైలైట్స్ చూసేయండి

Ind vs Aus 3rd T20 Records : భారత్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన 3వ టీ20లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక ఈ మ్యాచ్​లో నమోదైన రికార్డులు, హైలైట్స్ చూసేయండి

Ind vs Aus 3rd T20 Records
Ind vs Aus 3rd T20 Records
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 9:12 AM IST

Ind vs Aus 3rd T20 Records : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​లో భారత్​కు తొలి ఓటమి ఎదురైంది. గువహటి వేదికగా జరిగిన 3 టీ20లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (123*) శతకంతో అదరగొట్టాడు. అనంతరం ఛేదనలో ఆసీస్.. మ్యాక్స్​వెల్ (104*) విజృంభనతో నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని (225-5) పూర్తి చేసింది. ఇక ఇరు జట్ల ప్లేయర్ల దెబ్బకి ఈ మ్యాచ్​లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో చూసేద్దాం.

  • టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా మ్యాక్స్​వెల్ (4) రోహిత్ శర్మ (4) సరసన నిలిచాడు.
  • టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన భారత ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. ఇక టీ20ల్లో శతకం బాదిన తొమ్మిదో బ్యాటర్ రుతురాజ్.
  • పొట్టి ఫార్మాట్​లో వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాటర్ మ్యాక్స్​వెల్. అతడు 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
  • భారత్​లో జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు నమోదైన నాలుగో మ్యాచ్​ ఇది. ఈ మ్యాచ్​లో ఇరుజట్లు కలిపి 447 పరుగులు చేశాయి. ఈ లిస్ట్​లో 472 (అఫ్గానిస్థాన్ vs ఐర్లాండ్ 2019) పరుగులు టాప్​లో ఉంది.
  • టీ20ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్​లు బాదిన లిస్ట్​లో మ్యాక్స్​వెల్.. మూడో స్థానంలో ఉన్నాడు. అతడు భారత్​పై 37 సిక్స్​లు బాదాడు. ఈ జాబితాలో మ్యాక్స్​ కంటే ముందు డంబర్ (42 సిక్స్​లు vs బల్గేరియా), రోహిత్ శర్మ (39 సిక్స్​లు vs వెస్టిండీస్) ఉన్నారు.
  • టీ20ల్లో టీమ్ఇండియాపై ఎక్కువ పరుగులు బాదిన రెండో ఆటగాడు మ్యాక్స్​వెల్. అతడు 554 పరుగులు బాదాడు. నికోలస్ పూరన్ (592) అతడి కంటే ముందున్నాడు.
  • పొట్టి క్రికెట్ ఫార్మాట్ ఛేజింగ్​లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ మ్యాక్స్​వెల్. అతడు 3 సెంచరీలు ఛేజింగ్​లో చేసినవే.. అతడి తర్వాత బాబర్ అజామ్ (2), మహమ్మద్ వాసిమ్ (2) ఉన్నారు.
  • టీ20ల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆసీస్ బౌలర్​గా మ్యాక్స్​ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్​లో వేసిన మ్యాక్స్​ వేసిన 20వ ఓవర్​లో టీమ్ఇండియా బ్యాటర్లు 30 పరుగులు పిండుకున్నారు.

ఈ మ్యాచ్​లో ఇరుజట్ల బ్యాటర్లు సెంచరీలు బాదారు. పూర్తిగా బ్యాటర్లదే ఆధిపత్యంగా సాగిన మ్యాచ్ హైలైట్స్​ కూడా చూసేయండి.

ఇషాన్ భారీ తప్పిదం - మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ ఇదే!

ఊపుమీదున్న టీమ్ఇండియా- డిఫెన్స్​లో పడ్డ ఆసీస్​, జట్టులో కీలక మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.