విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తాజాగా ఓ పిల్లితో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకున్నాడు. మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. 'కూల్ క్యాట్' ఆకస్మిక తనిఖీతో ఆశ్చర్యపరిచిందని రాసుకొచ్చాడు. ఆ ఫొటోలు చూసి ముగ్దురాలైన విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 'హలో బిల్లీ' అని పలకరించింది. దానికి సమాధానంగా 'దిల్లీ అబ్బాయితో.. ముంబయి పిల్లి' అని కోహ్లీ కామెంట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అదే జట్టుతో నవంబరు 25 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో కూడా కోహ్లీ ఆడటం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్యా రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కాగా, టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడం వల్ల.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. డిసెంబరు 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు.