Shami World Cup Wickets : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. వన్డే వరల్డ్ కప్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి స్థానానికి చేరువయ్యాడు. ఇప్పటివరకు 13 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లు ఆడిన షమీ.. 40 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్ కప్‌ల్లో మొత్తం 23 ఇన్నింగ్స్‌లు ఆడిన షమీ 44 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జవగళ్ శ్రీనాథ్.. మొత్తం 33 ఇన్నింగ్స్‌లు ఆడి 44 వికెట్లు తీశాడు.
-
Red hot Shami broke England's back in the run-chase with a terrific four-wicket haul 🫡#INDvENG #CWC23 pic.twitter.com/fLBY1jWPPW
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Red hot Shami broke England's back in the run-chase with a terrific four-wicket haul 🫡#INDvENG #CWC23 pic.twitter.com/fLBY1jWPPW
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023Red hot Shami broke England's back in the run-chase with a terrific four-wicket haul 🫡#INDvENG #CWC23 pic.twitter.com/fLBY1jWPPW
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023
India Vs England World Cup 2023 : 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించి నాకౌట్ బెర్తును ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. లివింగ్‌స్టోన్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత బౌలర్ల ధాటికి స్వల్ప టార్గెట్‌ను కూడా ఛేదించలేకపోయింది ఇంగ్లాండ్. షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ ముప్పేట ఆ జట్టుపై ముప్పేట దాడి చేశారు. వీరి ధాటికి గట్టి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ కూడా తట్టుకోలేకపోయింది. అందులో ముఖ్యంగా షమీ నాలుగు వికెట్లు అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ ప్రతి బంతికీ వికెట్ తీసేలా అనిపించింది. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లనే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశాడు. అయితే ఎప్పుడైతే షమీ జట్టుతో చేరాడో అప్పటి నుంచి టీమ్ఇండియా పేస్ విభాగం మరింత పదునెక్కింది. ఈ వరల్డ్ కప్‌లో తొలిసారి కివీస్‌పై ఆడిన షమీ.. ఐదు వికెట్ల (Shami World Cup 2023 Wickets) ప్రదర్శన చేసి అబ్బురపరిచాడు.