ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన విరాట్​ కోహ్లీ- ఈ వరల్డ్​ కప్​లో నమోదైన రికార్డులివే!

ICC World Cup 2023 Records : ఫైనల్​లో టీమ్ఇండియాపై గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్​ టైటిల్​ను సాధించింది. ఈ క్రమంలో ఈ వరల్డ్​ కప్​లో ఇప్పటివరకు నమోదైన రికార్డుల గురించి తెలుసుకుందాం.

ICC World Cup 2023 Records
ICC World Cup 2023 Records
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 10:58 PM IST

Updated : Nov 20, 2023, 6:26 AM IST

ICC World Cup 2023 Records : 2023 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమ్ఇండియాకు.. తుదిపోరులో నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్​ సమరంలో భారత్​పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరో సారి కప్‌ను ముద్దాడింది. ఆసీస్​ టీమ్​లో ట్రావిస్ హెడ్‌ (137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో విజృంభించిన వేళ 43 ఓవర్లలోనే 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. లబుషేన్‌ (58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్​ కప్​లో నమోదైన రికార్డుల గురించి తెలుసుకుందాం.

ఈ వరల్డ్​ కప్​లో నమోదైన రికార్డులు..

  • 2023 ఎడిషన్ వరల్డ్​ కప్​లో ఫైనల్‌లో భారత్‌ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా ఆరో ప్రపంచకప్ టైటిల్​ను సాధించింది. ఆసీస్​ జట్టు 1987, 1999, 2003, 2007, 2015లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
  • క్రికెట్​ చరిత్రలో ఒక వరల్డ్​ కప్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​ విరాట్​ కోహ్లీ నిలిచాడు. ఈ ఎడిషన్​లో మొత్తం 765 పరుగులు చేశాడు. 95.62 సగటు 90.31 స్ట్రైక్ రేట్‌తో, మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో ఈ ఘనత సాధించాడు.
  • 2003 ఎడిషన్‌లో సచిన్ తెందూల్కర్ నమోదు చేసిన 673 పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. దీంతోపాటు ప్రపంచ కప్ చరిత్రలో 700 పరుగుల మైలురాయిని సాధించిన తొలి ప్లేయర్​గా నిలిచాడు.
  • లీగ్​ దశలో మొదటి నాలుగు మ్యాచ్​లను ఆడకపోయినప్పటికీ.. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచ్​ల్లో 24 వికెట్లు తీశాడు టీమ్ఇండియా బౌలర్ మహ్మద్​ షమీ. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
  • 2023 ప్రపంచ కప్​ మ్యాచ్​లో నమోదైన అత్యధిక స్కోరు 428/5. దిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికా స్కోర్​ చేసింది.
  • 2023 ప్రపంచకప్‌లో 400కు పైగా స్కోరు మూడు సార్లు నమోదయ్యింది. దక్షిణాఫ్రికా కాకుండా నెదర్లాండ్స్‌పై టీమ్ఇండియా రెండవ అత్యధిక 410/4 స్కోరు చేసింది. పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ 401/6 పరుగులు చేసింది.
  • ముంబయిలో జరిగిన మ్యాచ్​లో శ్రీలంకకు భారత్ 357/8 టార్గెట్ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ ప్రపంచ కప్​లో ఇది జట్టు అత్యల్ప స్కోరు. కోల్‌కతాలో దక్షిణాఫ్రికాను టీమ్ఇండియా 83 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇది రెండో అత్యల్పం.
  • ఈ వరల్డ్​ కప్​లో అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా బ్యాటర్​ గ్లెన్ మ్యాక్స్​వెల్ 128 బంతుల్లో 201 (21x4, 10x6) పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఈ ప్రపంచకప్​లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. దీంతోపాటు ఈ వరల్డ్​ కప్​లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్​గానూ రికార్డు సృష్టించాడు.
  • ఒక ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్స్​లు బాదిన ప్లేయర్​గా పాకిస్థాన్ బౌలర్ ఫకర్ జమాన్ నిలిచాడు. ఓ మ్యాచ్​లో 81 బంతుల్లో 11 సిక్స్​లు బాది 126* పరుగులు చేశాడు.
  • ఈ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ చేసిన నాలుగు సెంచరీలు చేసి.. ఈ టోర్నీలో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్​గా రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో కోహ్లీ (3), న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర (3) ఉన్నారు.
  • నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.
  • అన్ని ప్రపంచకప్ కప్​లో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (49)ను రోహిత్ శర్మ అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు మొత్తం 54 సిక్సర్లు బాదాడు. అందులో 31 సిక్స్​లు ఈ ఎడిషన్‌లోనే బాదడం గమనార్హం
  • టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 57 పరుగులు సమర్పించి 7 వికెట్లు తీశాడు. వరల్డ్​ కప్​లో ఇలా ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఏకైక ప్లేయర్​గా నిలిచాడు.
  • శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 345 పరుగులు టార్గెట్​ను పాకిస్థాన్​ విజయవంతంగా ఛేదించింది. ఈ వరల్డ్​ కప్​లో ఇదే సక్సెస్​ఫుల్​ ఛేజ్​.
  • ఓడీఐ చరిత్రలో అత్యంత ఖరీదైన బౌలర్​గా నెదర్లాండ్స్​కు చెందిన బాస్​ డి లీడే నిలిచాడు. దిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 2 వికెట్లు తీసి 112 పరుగులు సమర్పించుకున్నాడు.
  • శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్​క్రమ్​ 49 బంతుల్లో ఈ ప్రపంచ కప్​లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆ రికార్డును ఆసీస్​ బ్యాటర్​ 40 బంతుల్లో సెంచరీ చేసి ఛేదించాడు.

వరల్డ్​ కప్​ ఫైనల్​ ఫీవర్​- టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయిన అభిమానులు!

కోహ్లీ అస్సలు ఊహించలేదు- టీమ్ఇండియా వికెట్లు కూలాయిలా!

Last Updated : Nov 20, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.