ICC ODI Ranking : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (830 రేటింగ్స్)తో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ఇండియా నుంచి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని దక్కించుకున్న నాలుగో బ్యాటర్‌గా శుభ్‌మన్ నిలిచాడు. అతడి కంటే ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు.
ఇదివరకు ఈ స్థానంలో దాదాపు 952 రోజులపాటు.. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కొనసాగాడు. ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన కారణంగా బాబర్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం బాబర్ (824 రేటింగ్స్) తో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో ఎక్కువ రోజులు టాప్ ప్లేస్‌లో కొనసాగిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో తెలుసుకుందామా?
వన్డే ర్యాంకింగ్స్‌లో ఎక్కువ రోజులు ఆగ్ర స్థానంలో కొనసాగిన బ్యాటర్లు..
- బ్రియన్ లారా.. . వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా తన వన్డే కెరీర్లో.. 2104 రోజులు టాప్‌లో కొనసాగాడు. అందులో 1996 మార్చి 9 నుంచి, 1999 జనవరి 21 వరకు వరుసగా 1049 రోజులు అగ్ర స్థానంలో ఉన్నాడు.
- వివ్ రిచర్డ్స్.. వివ్ రిచర్డ్స్.. 1984 జనవరి 8 నుంచి 1988 అక్టోబర్ 20 వరకు వరుసగా 1748 రోజులు టాప్ పొజిషన్లో కొనసాగాడు. ప్రపంచలో ఏ బ్యాటర్ కూడా ఇన్ని రోజులు వరుసగా టాప్ ప్లేస్‌లో ఉండలేదు.
- విరాట్ కోహ్లీ.. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన కెరీర్లో 1493 రోజులు తొలి ర్యాంక్‌లో ఉన్నాడు. ఇందులో 2017 అక్టోబర్ 22 నుంచి 2021 ఏప్రిల్ 1 వరకు వరుసగా 1258 రోజులు టాప్‌లో ఉన్నాడు.
- ఏబీ డివిలియర్స్.. సౌతాఫ్రికా మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. కెరీర్లో 1480 రోజులు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.
- మిచెల్ బెవన్.. ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ బెవన్.. 1392 రోజులు టాప్ పొజిషన్లో కొనసాగాడు. అతడు 1999 జనవరి 23 నుంచి 2002 జులై 3 వరకు ఈ ప్లేస్‌లో ఉన్నాడు.
- డీన్ జాన్స్.. ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ జాన్స్ .. వరుసగా 1146 రోజులు ఫస్ట్ ర్యాంక్‌లో కొనసాగాడు.
- బాబర్ ఆజామ్.. 2021 ఏప్రిల్ 14 నుంచి 2023 నవంబర్ 8 వరకు వరుసగా 951 రోజులు బాబర్ అగ్రస్థానంలో కొనసాగాడు.
టాప్ పొజిషన్‌కు గిల్ - కెరీర్లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్
Team India ODI Ranking 2023 : టీమ్ఇండియా.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఫీట్.. నెం.1గా ఘనత