ETV Bharat / sports

అంతరిక్షంలోకి వరల్డ్​ కప్​ ట్రోఫీ.. నేరుగా మోదీ స్టేడియంలో ల్యాండ్​

ICC men s world cup 2023 trophy : ఈ ఏడాది జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి అరుదైన, ఆసక్తికరమైన ఘటన జరిగింది. విజేతకు బహుకరించే వరల్డ్ కప్‌ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ రిలీజ్​ చేసింది.

Out of this world  ICC World Cup trophy sent to space
అంతరిక్షంలోకి వరల్డ్​ కప్​ ట్రోఫీ.. భూమికి లక్షా 20వేల అడుగుల ఎత్తులో..
author img

By

Published : Jun 26, 2023, 10:25 PM IST

Updated : Jun 26, 2023, 10:52 PM IST

ICC men s world cup 2023 trophy : ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 ట్రోఫీ వరల్డ్ టూర్​కు సిద్ధమైంది. అయితే ఈ టూర్​ను ఎవరూ ఊహించని రీతిలో స్పేస్​లో లాంఛ్​ చేసి ఆశ్చర్యపరిచారు నిర్వాహకులు. భూమికి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో స్ట్రాటోస్పియర్​లో ఈ ట్రోఫీని ప్రవేశపెట్టడం విశేషం. ఆ తర్వాత ట్రోఫీని నేరుగా అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్ చేశారు.

ఈ ప్రపంచ కప్ ట్రోఫీ జూన్​ 27 నుంచి 100 రోజుల పాటు 18 దేశాల్లో ప్రపంచ యాత్రకు బయలుదేరనుంది. ఈ సందర్భంగా ట్రోఫీని స్పేస్​లో లాంఛ్​ చేయడానికి సిద్ధం చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్​ అయ్యే వరకూ మూడు నిమిషాల వీడియోను ఐసీసీ పోస్​ చేసింది. కాగా, 2023 వన్డే వరల్డ్ కప్​ను భారత్​ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్​ ట్రోఫీని స్ట్రాటోస్పియరిక్ బెలూన్​కు కట్టి అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. భూమికి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉంచారు. ట్రోఫీ అంతరిక్షంలో ఉన్న ఫొటోలు, వీడియోలను 4కే కెమెరాలతో షూట్​ చేశారు.

భారత్​లో ప్రారంభమయ్యే ఈ ట్రోఫీ టూర్​.. కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాంజ్​, సౌతాఫ్రికా లాంటి అనేక దేశాల్లో పర్యటించనుంది. జూన్ 27 నుంచి జులై 14 వరకూ భారత్​లోని ట్రోఫీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్లి.. తిరిగి సెప్టెంబర్ 4న భారత్​కు చేరుకుంటుంది. దాదాపు 10 లక్షల మంది ఈ ట్రోఫీని నేరుగా చూసే అవకాశం కూడా కల్పించనున్నారు నిర్వాహకులు.

  • An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICCpic.twitter.com/wNZU6ByRI5

    — Jay Shah (@JayShah) June 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ ఇదే

  • జూన్ 27 నుంచి జులై 14 వరకు భారత్​లో
  • జులై 15 నుంచి జులై 16 వరకు న్యూజిలాండ్​లో
  • 17 జూలై నుంచి 18 జులై వరకు ఆస్ట్రేలియా
  • జులై 19 నుంచి జులై 21 వరకు పాపువా న్యూ గినియా
  • 22 జులై నుంచి 24 జులై వరకు మళ్లీ భారత్​కు
  • 25 జులై నుంచి 27 జులై వరకు USA
  • 28 జులై నుంచి - 30 జులై వరకు వెస్టిండీస్
  • జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు పాకిస్థాన్
  • 5 ఆగస్టు నుంచి 6 ఆగస్టు వరకు శ్రీలంక
  • 7 ఆగస్టు నుంచి 9 ఆగస్టు వరకు బంగ్లాదేశ్
  • 10 ఆగస్టు నుంచి 11 ఆగస్టు వరకు కువైట్
  • 12 ఆగస్టు నుంచి 13 ఆగస్టు వరకు బహ్రెయిన్
  • 14 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు భారతదేశం
  • 16 ఆగస్టు నుంచి 18 ఆగస్టు వరకు ఇటలీ
  • 19 ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు ఫ్రాన్స్
  • 21 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు ఇంగ్లాండ్
  • 25 ఆగస్టు నుంచి 26 ఆగస్టు వరకు మలేషియా
  • 27 ఆగస్టు నుంచి 28 ఆగస్టు వరకు ఉగాండా
  • 29 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు నైజీరియా
  • ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు సౌతాఫ్రికా
  • సెప్టెంబర్ 4 నుంచి మళ్లీ భారత్​కు చేరుకుంటుంది.

ఇదీ చూడండి :

ICC ODI World cup 2023 : వన్డే ప్రపంచకప్​పై ఐసీసీ కీలక అప్డేట్​.. ​

బీసీసీఐ యూటర్న్​.. వరల్డ్​కప్​నకు ముందు 2సార్లు భారత్ ​x పాక్​​ ఢీ!

Last Updated : Jun 26, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.