ETV Bharat / sports

ఐసీసీ ఇంత పెద్ద తప్పు చేశావేంటి?.. నిరాశలో టీమ్​ఇండియా​ ఫ్యాన్స్​ - టెస్ట్ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. టీమ్​ఇండియా విషయంలో ఓ చిన్న తప్పిదం జరిగిందని పేర్కొంది. దీంతో ఫ్యాన్స్​ నిరాశ చెందారు.

ICC apologises for ranking glitch which showed India as No 1 Test side
ఐసీసీ ఇంత పెద్ద తప్పు చేశావేంటి?.. నిరాశలో టీమ్​ఇండియా​ ఫ్యాన్స్​
author img

By

Published : Feb 16, 2023, 3:05 PM IST

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకున్న‌ట్లు బుధ‌వారం ఐసీసీ వెబ్‌సైట్‌లో క‌నిపించింది. దీంతో టీమ్ ఇండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్ప‌టికే వ‌న్డేల్లో, టీ20ల్లో అగ్ర స్థానంలో ఉన్న టీమ్ ఇండియా టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

అయితే దీనిపై ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది. భారత క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. తాము చేసిన త‌ప్పిదం కారణంగానే ఇండియా నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉన్నట్లుగా క‌నిపించిందని పేర్కొంది. సైట్‌లో నెల‌కొన్న సాంకేతిక స‌మ‌స్య‌ కార‌ణంగానే ఇలా జరిగిందని స్పష్టతనిచ్చింది. ఆ త‌ప్పును నాలుగైదు గంట‌ల త‌ర్వాత స‌రిదిద్దినట్లు పేర్కొంది. "టెక్నిక‌ల్ ఎర్ర‌ర్ కార‌ణంగా సైట్‌లో ఇండియా నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉన్న‌ట్లుగా చూపించింది. ఆ త‌ప్పును తొంద‌ర‌గానే స‌రిదిద్దాం. క్షమించండి" అని పేర్కొంది. టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఆస్ట్రేలియానే ఉందని, భారత్ కాదని చెప్పింది. సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా నెల‌కొన్న ఈ అసౌక‌ర్యానికి చింతిస్తూ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది.

కాగా, ప్ర‌స్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉండ‌గా రెండో ర్యాంకులో టీమ్​ఇండియా నిలిచింది. మ‌రోవైపు వ‌న్డేల్లో, టీ20ల్లో మాత్రం టీమ్​ఇండియానే నెం.1 ప్లేస్‌లో ఉంది.

ఇదీ చూడండి: ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? ఈ వీకెండ్​ ఓటీటీ సినిమాల లిస్టు ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.