Mens T20 player of the year 2021: ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు కోసం నలుగురు నామినేట్ అయ్యారు. ఇందులో టీమ్ఇండియా ప్లేయర్స్‌కు చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా, అస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్,పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నామినేట్ అయినట్లు ఐసీసీ పేర్కొంది.
జాస్ బట్లర్.. ఈ ఏడాది టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 589 పరుగలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో 269 రన్స్‌తో అదరగొట్టాడు.
ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఏడాది 627 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. టీ20 ప్రపంచకప్‌లో 281 పరుగులు చేయగా.. మొత్తంగా ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 1326 రన్స్ చేశాడు.
శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మొత్తంగా 11.63 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ తనదైన ముద్రవేశాడు.
అంతకుముందు టెస్ట్ ప్లేయర్ ఆప్ ది ఇయర్-2021 అవార్డు కోసం భారత టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జేమిసన్, శ్రీలంక టెస్టు జట్టు సారథి దిముత్ కరుణరత్నె నామినేట్ అయినట్లు ఐసీసీ పేర్కొంది.
ఇదీ చూడండి: కోహ్లీ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే.. ఈ ఏడాది కూడా సెంచరీ లే!