ఇటీవలే ఆటకు దూరమవ్వబోతున్నా అంటూ రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేసిన అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ తన మనసు మార్చుకుంది. తాను ఆట నుంచి రిటైర్ కావట్లేదని తెలిపింది. మళ్లీ కోర్టులో అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. "నేను రిటైర్ అవ్వట్లేదు. తిరిగి కోర్టులో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మా ఇంటికొస్తే అక్కడ ఉన్న ఓ కోర్టును కూడా చూడొచ్చు" అని ఓ మీడియా సమావేశంలో పేర్కొంది.
గెలుపే లక్ష్యంగా టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్.. కెరీర్లో ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్‌లను తన ఖాతాలో వేసుకుంది. అలా గెలుస్తూనే.. స్టెఫీగ్రాప్, క్రిస్ ఎవర్ట్, మార్టినా నవ్రతిలోవా వంటి దిగ్గజాలను అధిగమించింది.అయితే ఆల్‌టైం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మార్గరెట్ కోర్ట్ పేరుతో ఉంది. ఆమె 24 గెలిచింది. ఎలాగైనా సరే ఆమె రికార్డును సమం చేయాలని మూడేళ్లకు పైగా సెరెనా శ్రమిస్తోంది. కానీ పరిస్థితులు అచ్చిరాకపోవడం, గాయాల బెడదతో కుదరడం లేదు. అయితే ఈ క్రమంలో ఆమె ఆగస్టు 9న రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేసింది. అయితే అప్పుడు మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనే పదం తనకు ఇష్టం లేదని.. టెన్నిస్‌కు దూరంగా ఉంటూ తనకిష్టమైన ఇతర విషయాల పట్ల దృష్టి సారిస్తానని ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు తాజా ప్రకటనతో మళ్లీ అభిమానుల్లో జష్ నింపింది.
ఇదీ చూడండి: నెదర్లాండ్స్‌తో రెండో మ్యాచ్.. కోహ్లీ-కార్తిక్.. రోహిత్-రాహుల్ స్పెషల్ ప్రాక్టీస్