ETV Bharat / sports

సిరాజ్​.. హైదరాబాద్​ రజనీకాంత్​- భారీ కటౌట్​ ఏర్పాటు ​

వికెట్​ పడగానే మూతిపై వేలు పెట్టి కొత్త సంజ్ఞలతో సంబరాలు చేసుకునే హైదరాబాద్​ బౌలర్​ మహ్మద్ సిరాజ్​పై అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడదే చిత్రంతో భారీ కటౌట్​ను ఏర్పాటు చేసిన అతడి మద్దతుదారులు.. సిరాజ్​.. హైదరాబాద్​ రజనీకాంత్​ అంటూ ప్రశంసిస్తున్నారు.

Mohammed Siraj
మహ్మద్ సిరాజ్
author img

By

Published : Aug 20, 2021, 5:46 PM IST

వికెట్​ పడగానే వినూత్న రీతిలో సంబరాలు చేసుకుంటాడు టీమ్ఇండియా యువ బౌలర్​ మహ్మద్ సిరాజ్​. నోరు మూసుకోండి అని అర్థం వచ్చేలా.. మూతిపై వేలు చూపిస్తుంటాడు. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ అతను ఆ స్టైల్​ను మాత్రం మార్చలేదు. అయితే తనను తక్కువ చేసి మాట్లాడే వారికి సమాధానంగానే ఈ విధంగా సంజ్ఞలు చేస్తున్నట్లు సిరాజ్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే స్టైల్​లో భారీ కటౌట్​ను ఏర్పాటు చేశారు హైదరాబాద్​ అభిమానులు. మూడు అంతస్తుల ఎత్తులో రోడ్డు మధ్యలో అమర్చారు. మహ్మద్ సిరాజ్​.. హైదరాబాద్​ రజనీకాంత్​ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్​.

మహ్మద్​ సిరాజ్​.. ఇటీవల కాలంలో టీమ్ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ ఏడాది ఆరంభంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. అనతి కాలంలోనే జట్టులో కీలక బౌలర్​గా మారాడు. గబ్బాలో ఆసీస్​పై 5 వికెట్లతో మెరిసి బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ విజయంలో తనదైన పాత్ర పోషించాడు. తాజాగా లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో 8 వికెట్లతో మరోసారి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. తొలి టెస్టులో 3 వికెట్లతో పాటు మొత్తంగా 11 వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: లండన్​ వీధుల్లో సూర్య దంపతులు- 65 రోజుల తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.