భారత టెస్టు జట్టు మాజీ ఆటగాళ్లు శివలాల్‌యాదవ్, అర్షద్ అయూబ్ సహా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పెద్దలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు(TS High Court)లో చుక్కెదురైంది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని పేర్కొంది.
హెచ్‌సీఏలో అవినీతి, అక్రమాల(HCA corruption)పై సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి బాబూరావు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు హెచ్‌సీఏ పెద్దలపై అభియోగ పత్రం నమోదు చేశారు. అవినీతి కారణంగా ఉప్పల్ స్టేడియం నిర్మాణ వ్యయం రూ.30.26 కోట్ల నుంచి రూ.108 కోట్లకు చేరుకుందని అందులో పేర్కొన్నారు.
అయితే నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన ఏసీబీ కేసు కొట్టేయాలంటూ శివలాల్, అర్షద్, చలపతి, నరేశ్‌శర్మ, యాదగిరి, జాన్ మనోజ్, సయ్యద్ మొయిజుద్దీన్, సురేందర్ అగర్వాల్, నర్సింగ్‌రావు, ప్రదీప్ తదితరులు వేర్వేరుగా 4 పిటిషన్‌లను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ కింది కోర్టు విచారణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు.
ఇదీ చూడండి: Virat Kohli: ఎగిటేరియన్ ట్రోల్స్‌పై కోహ్లీ స్పందన!