Hardik Pandya IPL Trade : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిగ్గా మారాడు. అతడు ఐపీఎల్లో గుజరాత్ జట్టును వీడి.. తిరిగి ముంబయి గూటికి చేరనున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే హార్దిక్ ఐపీఎల్లో నిజంగానే ఫ్రాంచైజీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి హార్దిక్ నిర్ణయానికి కారణమేంటంటే?
ప్రముఖ స్పోర్ట్ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. హార్దిక్, అదనంగా పారితోషికం, ఎక్కువ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కావాలని.. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యాన్ని అడిగాడట. కానీ గుజరాత్ ఓనర్స్ దీనికి ఒప్పుకోలేదట. దీంతో హార్దిక్ ఇవే డిమాండ్లతో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీని కలిశాడని సమాచారం. అయితే ముంబయి యాజమాన్యం, హార్దిక్ అడిగినట్టు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అధికంగా ఇస్తామని హామీ ఇచ్చిందట. దీంతో హార్దిక్ ముంబయికి ఓకే చెప్పాడని సమాచారం. అయితే ఈ వ్యవహారమంతా జూలై - ఆగస్ట్‌లోనే జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌తో ముంబయి ఇండియన్స్ కూడా ఆగస్ట్‌లోనే డీల్ కుదుర్చుకుందట. కానీ, వరల్డ్‌కప్ కారణంగా ఈ విషయాన్ని అప్పుడే బయటకు చెప్పలేదని టాక్.
దీనిపై ఇరుజట్లు ఫ్రాంఛైజీలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆటగాళ్లను మార్చుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఆదివారం వరకు సమయం ఉంది. దీంతో ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే. ఒకవేళ హార్దిక్ ముంబయికి వెళ్తే.. యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ రావచ్చు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, లోకి ఫెర్గూసన్‌ను వదులుకునేందుకు సిద్ధమైందని సమాచారం. ఇక పంజాబ్ కింగ్స్ అయితే ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు శామ్ కరన్‌ను విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యిందట.
IPL 2024 Auction : 2024 ఐపీఎల్ సీజన్‌కుగాను డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం జరగనుంది. 300 మందికిపైగా ప్లేయర్లు ఈ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. కాగా, రీసెంట్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీని వదిలి, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. ఇక 2024 ఐపీఎల్లో గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
లఖ్‌నవూకు గంభీర్ గుడ్‌బై - మళ్లీ కోల్‌కతాతో జర్నీ స్టార్ట్
IPL 2023 KKR VS LSG : ప్లేఆఫ్స్‌కు చేరిన లఖ్‌నవూ.. ఒక్క పరుగు తేడాతో విజయాన్ని..