దిగ్గజ క్రికెటర్లు ధోనీ(చెన్నై సూపర్‌కింగ్స్ సారథి), కోహ్లీ(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్), ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ) వికెట్లను పడగొట్టడం తన కెరీర్లో అందుకున్న గొప్ప మైలురాళ్లని అన్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్(RashidKhan). ఈ ముగ్గురిని క్లీన్‌బౌల్డ్ చేసిన సందర్భాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు.
"మర్చిపోలేని వికెట్లు చాలా ఉన్నాయి. కానీ అందులో(టీ20) లెజెండ్ ప్లేయర్స్ ధోనీ(Dhoni), కోహ్లీ(Kohli), ఏబీ డివిలియర్స్(AB Devilliers)లను క్లీన్‌బౌల్డ్ చేయడం నా కెరీర్లో అతి పెద్ద విజయం. ఎందుకంటే వారిని బౌల్డ్ చేయడం చాలా కష్టమైన పని. ఎప్పటికీ వారిని ఔట్ చేసిన సందర్భాలను మర్చిపోను"
-రషీద్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లెగ్ స్పిన్నర్
దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌కు(Sachin Tendulkar) బౌలింగ్ చేయడం తనకు చాలా సంతోషాన్నిస్తుందని అన్నాడు రషీద్. గత 13ఏళ్ల వన్డే కెరీర్లో సచిన్‌ను తాను ఒకే ఒక్కసారి ఔట్ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. "లెగ్ స్పిన్‌లో సచిన్ ఔట్ కావడం చాలా అరుదు. అయినా ఆయన్ను ఔట్ చేయడం కన్నా బౌలింగ్ చేయడానికే ఎక్కువ అనందపడతాను. ఎందుకంటే మాస్టర్‌కు బౌలింగ్ చేయాలన్న నా కల నిజమైంది."