ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచులోనే తలపడటం టీమ్‌ఇండియాకు మంచిదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరు ముందుగా జరిగితే కోహ్లీసేన మిగతా టోర్నీపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూలు ఈ మధ్యే విడుదలైంది. షెడ్యూలును రెండు రౌండ్లుగా విభజించారు. తొలి రౌండ్లో ఒమన్, పపువా న్యూగినీ, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, నమీబియా తలపడతాయి. వీరిని రెండు బృందాలుగా విభజించి ఆడిస్తారు. ప్రతి విభాగం నుంచి టాప్-2 జట్లను రెండో రౌండ్‌కు పంపిస్తారు. అక్కడ మొత్తం 12 జట్లు సూపర్-12లో తలపడతాయి. అందులో భాగంగానే అక్టోబర్ 24న భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది.
"మేం గెలిచిన 2007లోనూ అంతే! ఆ టీ20 ప్రపంచకప్‌లో మా తొలి మ్యాచ్ స్కాట్లాండ్‌తో జరగాలి. వర్షంతో అది కుదర్లేదు. ప్రాక్టికల్‌గా తొలి మ్యాచ్ ఆడింది మాత్రం పాకిస్థాన్‌తోనే. నేను ఇప్పుడు చెబుతోందీ అదే. ఆరంభంలోనే పాక్‌తో తలపడితే టీమ్‌ఇండియాకు మేలు. అదే పనిగా పాక్ మ్యాచ్ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు. దేశ ప్రజలకూ అంతే అనుకోండి."
-గౌతమ్ గంభీర్
'ఫలితం గురించి మనకు తెలియదు. కానీ, టోర్నీ ఆరంభంలోనే రెండు జట్లు ఆడుతున్నందుకు నేనైతే సంతోషంగా ఉన్నాను' అని గంభీర్ స్పష్టం చేశాడు. ప్రపంచకప్ కోసం టీమ్‌ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో పదేపదే సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓడిపోతుండటంతో ఈ సారి దాన్నుంచి బయటపడాలని భావిస్తోంది. కీలక మ్యాచుల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
ఇవీ చదవండి: