ETV Bharat / sports

ధోనీ కుమార్తెకు స్పెషల్​ గిఫ్ట్​ పంపిన మెస్సి.. ఏంటంటే? - ziva dhoni news

ఫిఫా వరల్డ్​ కప్​ 2023 టైటిల్‌ నెగ్గిన ఆనందంలో మునిగి తేలుతున్న మెస్సి తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. అయితే తాజాగా అతడు ధోనీ కూతురు జీవాకు ఓ స్పెషల్ గిఫ్ట్​ ఇచ్చి సర్​ప్రైజ్​ చేశాడు.

Dhoni messi fifa worldcup 2023
ధోనీ కుమార్తెకు స్పెషల్​ గిఫ్ట్​ పంపిన మెస్సి.. ఏంటంటే?
author img

By

Published : Dec 28, 2022, 12:14 PM IST

Updated : Dec 28, 2022, 12:43 PM IST

ఇటీవలి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి.. అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి తనదైన ఆట శైలితో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఫిఫా ప్రపంచ కప్‌ ట్రోఫీని ముద్దాడి తన చిరకాల కలను నెరవేర్చుకున్నాడు.

టైటిల్‌ నెగ్గిన ఆనందంలో మునిగి తేలుతున్న మెస్సి తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. ఇక భారత్‌లోనూ అతడికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. ధోనీ, కోహ్లీ లాంటి క్రికెటర్లూ అతడిని ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో ధోనీ కూతురు జీవాకు.. మెస్సి తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని పంపి తన ప్రేమను చాటాడు.

ఆ జెర్సీని ఇన్‌స్టాలో పోస్టు చేసిన జీవా.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆ జెర్సీపై 'జీవా కోసం' అని రాసి దాని కింద మెస్సి సంతకం చేశాడు. గతంలో కూడా మెస్సి.. బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఇలాంటి జెర్సీనే పంపిన విషయాన్ని స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా వెల్లడించిన విషయం తెలిసిందే.

ధోనీ కుమార్తెకు స్పెషల్​ గిఫ్ట్​ పంపిన మెస్సి.

ఇదీ చూడండి: ఇక శిఖర్​ ధావన్ పరిస్థితి ఏంటి.. కెరీర్​ ముగిసినట్టేనా?

Last Updated : Dec 28, 2022, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.